గేమ్ ఛేంజర్” ఆన్లైన్ టీజర్ ముహుర్తం కుదిరింది!

Andhrawatch
1 Min Read

గ్లోబల్ స్టార్, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా టాలెంటెడ్‌ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “గేమ్ ఛేంజర్”గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అవైటెడ్ టీజర్ ని మేకర్స్ నేడు గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారనే సంగతి తెలిసిందే.

అయితే ముందుగా ఇండియా వైడ్ గా పలు థియేటర్స్ లో ప్లాన్ చేయగా లక్నోలో అయితే గ్రాండ్ గా ఈవెంట్ ని కూడా ప్లాన్‌ చేసి దానిని సక్సెస్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.  ఇక ఈ సినిమా ఆన్లైన్ టీజర్ పై ఇపుడు అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ టీజర్ ని మేకర్స్ ఈ సాయంత్రం మొత్తం మూడు భాషల్లో 6 గంటల 3 నిమిషాలకి వదులుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసారు. దీంతో ఆన్లైన్ లో  గేమ్ ఛేంజర్ టీజర్ టేకోవర్ అప్పుడు నుంచి ఉంటుంది అని చెప్పాలి. 

Share This Article