శంకర్ మాస్ సంభవం కోసం అంతా ఎదురు చూపులు!

Saturday, December 7, 2024

ఇండియన్  మూవీ దగ్గర తనదైన సినిమాలతో మావెరిక్ దర్శకుడు శంకర్ వేసుకున్న ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన విజన్ తో ఎప్పుడో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని శంకర్ ఇంటర్నేషనల్ లెవెల్లో సెట్ చేశారు. అందుకే తనని ఇండియన్ జేమ్స్ కేమరూన్ అని కూడా పిలుస్తారు.

అయితే ఇపుడు అంతా శంకర్ మాస్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సెన్సేషనల్ కాంబినేషన్ గా వస్తున్న “గేమ్ ఛేంజర్” తోనే శంకర్ మళ్ళీ తన మాస్ సంభవం చూపిస్తారని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెయిన్ గా గేమ్ ఛేంజర్ టీజర్ సహా సినిమా పైనే ఇపుడు ఫోకస్ అంతా మారింది.

శంకర్ ఎలా ట్రీట్ చేస్తారు ఏ రేంజ్ గ్రాండియర్ చూపించనున్నారు అనేదే మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంకా చాలా మంది అయితే శంకర్ మళ్ళీ తానేంటో చూపించాల్సిన సమయం ఇదే అని చెప్పుకుంటున్నారు. ఇలా మొత్తంగా మాత్రం శంకర్ పేరు మరోసారి గేమ్ ఛేంజర్ తో ఓ రేంజ్ హైలైట్ గా నిలిచింది.

 మరి ఈ సినిమాకి శంకర్ ఎలాంటి వర్క్ ఇచ్చారో ఇపుడు టీజర్ నెక్స్ట్ సినిమాతో తెలిపోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles