ఫౌజీ సెట్లోకి సీనియర్‌ హీరోయిన్‌!

Sunday, December 22, 2024

ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ భారీ యాక్షన్‌ సినిమాలే. దాంతో ఆయన అభిమానులు కాస్త మార్పు కావాలని కోరుకుంటున్నారు. ప్రభాస్‌ అదే ఫీల్ అవుతున్నాడేమో మారుతి దర్శకత్వంలో హర్రర్‌ కామెడీ సినిమా రాజాసాబ్‌ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయిపోయింది కూడా.

వచ్చే ఏడాది వేసవిలో రాజా సాబ్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది.  సీతారామం వంటి డీసెంట్‌ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్ర యూనిట్‌ టైటిల్‌ ని అధికారికంగా ప్రకటించనప్పటికీ ఫౌజీ టైటిల్ నే మెయిన్‌ గా తెరమీదకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఫౌజీ సినిమా లాంఛనంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మధురైలో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు యూనిట్‌ సభ్యులతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే.

అక్కడ జరుగుతున్న షూటింగ్‌ కి ఇటీవల హీరోయిన్ ఇమాన్వి ఇంకా ఆలనాటి అందాల  హీరోయిన్‌ జయప్రద కూడా జాయిన్‌ అయ్యారు. ప్రస్తుతం వారిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ సినిమాలో ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయట. తెలుగు లో ఒకప్పుడు లెజెండ్రీ హీరోలతో నటించిన జయప్రద ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles