మురుగదాస్‌ సినిమా కోసం సల్మాన్‌ మేకోవర్‌!

Sunday, October 13, 2024

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా  హీరోయిన్ గా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా“సికందర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాతో మరోసారి సల్మాన్, మురుగదాస్ లు కలవడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా కోసం సల్మాన్ ప్రిపేర్ చేస్తున్న లేటెస్ట్ లుక్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. సల్మాన్ ఎక్స్ ఖాతా నుంచి ఈ సినిమా కోసం జిమ్ లో చెమటలు చిందిస్తున్న పిక్ ని అభిమానుల కోసం షేర్ చేసాడు. ఇందులో సల్మాన్ సాలిడ్ ఫిజిక్ అండ్ తన ఇంటెన్స్ కళ్ళని ఈ ఫొటోలో చూడొచ్చు.

దీంతో ఈ సినిమాలో కూడా తన పర్సనాలిటీతో అదరగొట్టనున్నాడని చెప్పాలి. మరి ఈ సినిమాలో కూడా మురుగదాస్ భారీ యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి ఈసారి సల్మాన్ తో యాక్షన్ ఏ లెవెల్లో ఉంటుంది అనే దాని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles