మాఫియా డాన్ దందాలో ‘జగన్ దళం’ పాత్ర!

Friday, December 5, 2025

తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా సాగుతోంది వ్యవహారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులు  అయిన అధికారులు కృష్ణమోహన రెడ్డి, ధనంజయరెడ్డి లాంటివాళ్లు అరెస్టు అయిన తర్వాత.. గతంలో వారు పాల్పడిన పాపాలన్నీ కూడా తామరతంపరగా బయటపడుతున్నాయి. మామూలు నేరాలు కాదు.. వారు చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రస్థానం ప్రారంభించినప్పుడే.. పెద్దపెద్ద నేరాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకున్నారేమో అనిపించేలా ఇదంతా సాగుతోంది. అన్నింటినీ మించి అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూసలేం ప్రియురాలు, ఒకనాటి బాలీవుడ్ హీరోయిన్ మోనికా బేడీ దేశం దాటి పరారు కావడానికి నకిలీ పాస్ పోర్టు పొందడంలో జగన్ దళంలో కీలకంగా ఉంటూ ఇప్పుడు అనేక కేసుల్లో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, సంజయ్ తదితరులు ఉండడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. 2001లో సినీనటి మోనికా బేడీ కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్నట్టుగా చూపించి సనా మాలిక్ కమల్ అనే పేరుతో నకిలీ పాస్ పోర్టు పొంది దేశం విడిచి పారిపోయారు. కర్నూలు లోని బాబూగౌడ వీధిలో నివాసం ఉంటున్నట్టుగా ఆమెకు నివాసధ్రువీకరణ పత్రం ఇచ్చిన అప్పటి తహసీల్దారు.. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో వసూళ్లకు పెద్దగా వ్యవహరించిన జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డే. ఆ సర్టిఫికెట్ తో నకిలీ పాస్ పోర్టు పొందిన మోనికా బేడీ.. 2002లో ప్రియుడు మాఫియా డాన్ అబూసలేంతో కలిసి పోర్చుగల్ కు పారిపోయాి అక్కడ పోలీసులకు దొరికారు. తీగలాగితే కర్నూలు కేంద్రంగా నకిలీ పాస్ పోర్టుల బాగోతం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సీబీఐ అప్పటి తహసీల్దారు కృష్ణమోహన్ రెడ్డిని విచారిస్తే.. ఆయన వ్యవహారాన్ని ఆర్ఐ మీదకు నెట్టేశారు. ఆర్ఐ మహ్మద్ యూనిస్ ఇచ్చిన నివేదికను బట్టి.. ధ్రువపత్రం జారీచేశానని చెప్పి సాక్షిగా మారి తప్పించుకున్నారు.

తమాషా ఏంటంటే.. ఈ నకిలీ పాస్ పోర్టు జారీ అయిన సమయంలో జగన్ దందాలకు కీలకంగా సహకరించిన మరో ఐపీఎస్ అధికారి, జగన్ జమానాలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన పీఎస్సార్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు. మోనికా బేడీ దొంగ పాస్ పోర్టుకు ఎన్వోసీ ఇచ్చింది ఆయనే. పీఎస్సార్ ఆంజనేయులు తర్వాత సంజయ్ కర్నూలు ఎస్పీగా వచ్చారు. ఈ సంజయ్- జగన్ జమానాలో సీఐడీ చీఫ్ గా వ్యవహరిస్తూ.. జగన్ ప్రత్యర్థులను టార్గెట్ చేసి వేధించిన అధికారే. అతను కర్నూలు ఎస్పీగా వచ్చాక 2002లో నకిలీ పాస్ పోర్టుల తయారీకి కర్నూలు కేంద్రంగా పెద్ద మాఫియా నడుస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. అయితే ఆ కేసులో సంజయ్ సరిగా విచారణ జరిపించలేదని, కీలక నిందితులు దేశం విడిచి పారిపోయే దాకా ఉపేక్షించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఈ రకంగా మాఫియా డాన్ అబూసలేం తన ప్రియురాలిని దేశం దాటించడానికి చేసిన నకిలీ పాస్ పోర్టుల కుట్రలో జగన్ దళంలో కీలకంగా ఎదిగిన అధికారులే.. పాతికేళ్ల కిందట ఈ అక్రమాలకు సహకరించినట్టుగా వెలుగుచూడడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles