బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే సౌత్ లో వరుస పెట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వబోతుంది. తన ఫస్ట్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే మరో రెండు ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
మిస్టర్ బచ్చన్ ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. ఈ మూవీ ఇంకా సెట్స్ పై ఉండగానే ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ఇప్పుడు మరో మూవీ ఆఫర్ అందిపుచ్చుకుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా రవి అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం హీరోయిన్ గా భాగ్యశ్రీని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదొక డిఫెరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుందని… ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.