మంగళగిరి నుంచి పరారీ.. నిజామాబాద్ లో ఆశ్రయం..

Wednesday, January 22, 2025

అతని పేరు బద్దం అశోక్ రెడ్డి. స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరినే! అక్కడే ఉంటాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం అతని వృత్తి. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఎవ్వరన్నా అతనికి లెక్కేలేదు. వారి గురించి వారి కుటుంబసభ్యుల గురించి అత్యంత అసహ్యమైన రీతిలో పోస్టులు పెడుతూ.. వారిని కించపరుస్తుంటాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి దన్ను చూసుకుని.. విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. హోం మంత్రి వంగలపూడి అనిత మీద కూడా అత్యంత అసభ్యమైన పోస్టులను తయారుచేసి సోషల్ మీడియా స్ప్రెడ్ చేశాడు. ప్రస్తుతానికి రిమాండులో కటకటాల వెనక ఉన్నాడు. కానీ ఈ ఘట్టం అంత తొందరగా కుదరలేదు. దాని వెనుక చాలా సుదీర్ఘమైన హైడ్రామా నడిచింది.

సోషల్ మీడియాలో వైసీపీ తరఫున అసభ్య పోస్టులు పెట్టే జగన్మోహన్ రెడ్డి వందల భక్తజనంలో బద్దం అశోక్ రెడ్డి కూడా ఒకడు. మంగళగిరి నుంచే విచ్చలవిడిగా పోస్టులు పెడుతుండేవాడు. తాజాగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సోషల్ మీడియా ముసుగులో హద్దులు దాటుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేసులు నమోదు అవుతున్న వారిని పోలీసుస్టేషన్ కు  పిలిపించి హెచ్చరించి 41ఏ  నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. శృతిమించుతున్న వారిని మాత్రం అరెస్టు చేస్తున్నారు. అరెస్టుల పర్వం సాగుతుండడంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

ఒకవైపు మీరు రెచ్చిపోతూనే ఉండండి.. మీకు పార్టీ అండగా ఉంటుంది. మీమీద కేసులు వస్తే మీ తరఫున మేం లీగల్ ఫైట్ చేస్తాం అంటూ సజ్జల రామక్రిష్ణారెడ్డి లాంటి వాళ్లు మరింతగా రెచ్చగొడుతున్నారు. మరొకవైపు డీజీపీతో సహా వివిధ ప్రాంతాల ఎస్పీలను కూడా ఉద్దేశించి.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. సప్తసముద్రాల ఆవల దాక్కున్నప్పటికీ వదిలిపెట్టేది లేదని తీసుకువచ్చి పగ సాధించి తీరుతామని జగన్మోహన్ రెడ్డి  హెచ్చరిస్తున్నారు. అయినా సరే.. అరెస్టులకు జడిసి సోషల్ పాపాలు చేసిన వారు పారిపోయి అజ్ఞాతంలోకి  వెళుతున్నారు.

ఈ మంగళగిరి బద్దం అశోక్ రెడ్డి కూడా అలాగే పారిపోయి నిజామాబాద్ లో తలదాచుకున్నాడు. పసిగట్టినపోలీసులు అతడిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. అతనికి 14 రోజుల రిమాండు విధించారు. ఎక్కడికి పారిపోయినాసరే.. వదిలిపెట్టేది లేదని పోలీసులు నిరూపిస్తున్నారు. ఇంకా ముందు ముందు అనేక అరెస్టులు ఉన్నాయని చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles