ఒక్క చాన్స్ అంటూ ఏపీ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అనేక రకాలుగా ప్రజలను వంచించారు. ప్రధానంగా.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల కాన్సెప్టును తెమీదకు తెచ్చారు. దానివల్ల రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా సర్వనాశనం చేశారో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ తమ దృష్టిలో అసలు అభివృద్ధి అంటే ఏమిటో అసలైన నిర్వచనం చెబుతున్నారు. జగన్ వంటి మాయగాళ్లకు ఈ అభివృద్ధి నిర్వచనం బుర్రకు ఎక్కుతుందో లేదో మరి?
జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభించిన తర్వాత.. ఆయన తీరు మారిపోయింది. అప్పటిదాకా అమరావతి రాజధానిని సపోర్టు చేసిన జగన్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. ఆ రాజధాని ఒక కులం వారి బాగుకోసం ఉద్దేశించినదని నిందలువేస్తూ.. ఆ ప్రాంతం మొత్తాన్ని స్మశానంలాగా మార్చేయడానికి తెగించారు. అయిదేళ్లు పదవీకాలంలో ఒక్క పని కూడా చేపట్టకుండా ఆ ప్రాంతాన్ని చిట్టడివిలాగా మార్చారు. 70 శాతం వరకు పూర్తయిన నిర్మాణాలు కూడా భూతగృహాల్లా కనిపించేలా చేశారు. అభివృద్ధి అంటే రాజధాని అనే పదం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నట్టుగా.. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతి లెజిస్లేటివ్ కేపిటల్, కర్నూలు జుడిషియరీ కేపిటల్ అంటూ మాయమాటలు చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలన్నారు. అలా చేస్తే మాత్రమే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని మభ్యపెట్టారు. పోనీ అలా చెప్పినందుకు విశాఖలోనైనా ఏదైనా చేసింది లేదు. అమరావతిని ఆయన చెప్పిన రూపంలోనైనా అభివృద్ధి చేయలేదు. కర్నూలు సంగతి సరేసరి.
కానీ.. అభివృద్ధి అనేదానికి రాజధాని ఒక్కటే మార్గం కాదని, ఆ నిర్వచనం అసలు వేరు అని.. నారా లోకేష్ చాలా స్పష్టంగా అనడం విశేషం. ‘పరిపాలన ఒకే చోట ఉండాలి. అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ జరగాలన్నదే మా ప్రభుత్వ సిద్ధాంతం’ అని లోకేష్ అంటున్నారు. నిజంగా ప్రగతిని కోరుకునే వారు అనుసరించాల్సిన అసలైన నిర్వచనం ఇదే.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉండి ఉంటే.. అమరావతి రాజధాని అనే దానిని ఆయన ద్వేష భావంతో విషపూరితంగా చూడకుండా.. తాను ముఖ్యమంత్రి కాగానే పనులను కొనసాగించి ఉంటే ఇవాళ రాష్ట్ర ముఖచిత్రం ఇంకోరకంగా ఉండేదని, ఆయన మరీ 11 సీట్లతో ప్రతిపక్షహోదాకు కూడా గతిలేని దయనీయ స్థితిలో పడే అవసరం కూడా ఏర్పడేది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నారా వారి అభివృద్ధి థియరీ జగన్‌కు అర్థమయ్యేనా?
Wednesday, January 22, 2025