సచివులకు కనీస కామన్ సెన్స్ పనిచేయదా?

Monday, January 20, 2025

ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇసుక సరఫరా చేసింది అంటారు.  మరొకవైపు  ఉచితంగా ఇసుక ఇవ్వడం తెలియజేశారు అని కూడా అంటారు.   ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వడం అంటూ జరిగితే అందులో దోపిడీ అనేది ఎలా ఉంటుంది?  ఇది సామాన్యులకు అర్థం కాని సంగతి.  ప్రజలు నమ్మలేని సంగతి కూడా.  ఎందుకంటే ఇసుక ధరల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో ఉన్న ధర,  ఇప్పుడు ఉన్న ధరలు ప్రజలు స్వయంగా ప్రతిరోజు చూస్తున్నారు.  ధర ఎంత పెరిగిపోయిందో వారికి చాలా స్పష్టంగా తెలుస్తుంది.  అలాంటప్పుడు ఇసుక ఉచిత సరఫరాలో కూడా  నిధులు స్వాహా చేశారంటూ చంద్రబాబు మీద కేసు నమోదు చేసినా,  దాని యొక్క ప్రచారం అంశంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్లినా..   జనం ఛీత్కరించుకుంటారు.

చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సిఐడి  ఆయన మీదమరికొన్ని కొత్త కేసు నమోదు చేసింది.  వాటిలో ఇసుక ఉచితంగా ఇవ్వడం ద్వారా వేల కోట్లు దిగమింగారు అనేది ప్రధాన ఆరోపణ.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులందరూ కూడా ఇదే పాట అందుకున్నట్టుగా కనిపిస్తోంది. బొత్స సత్యనారాయణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇప్పుడు ఇసుక వ్యాపారం ద్వారా.. ప్రభుత్వానికి ఏటా 500 కోట్ల ఆదాయం వస్తోందని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇలాంటి 2500 కోట్ల ఆదాయాన్ని చంద్రబాబునాయుడు దిగమింగాడని అంటున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే.. ఇప్పుడు అమ్ముతున్నారు గనుక.. డబ్బు వస్తున్నది. అప్పుడు ఉచితంగా ఇస్తే డబ్బు ఎలా వస్తుంది.. చంద్రబాబు ఎలా తినేస్తాడు అనేది ప్రశ్న. 

బొత్స డబ్బుల ఆదాయం లెక్కలు చెప్పగానే ప్రజలకు ఇంకో సందేహం కలుగుతోంది. ఏపీలో ఇసుక వ్యాపారానికి కేవలం క్యాష్ మాత్రమే చెల్లించాలి. యూపీఐ, ఆన్ లైన్, డిజిటల్ చెల్లింపులు లేవు. అందువల్లనే భారీ అవినీతి జరుగుతోందని ప్రతి ఒక్కరికీ తెలుసు. 500 కోట్లు ఏడాదికి లెక్కల్లో చూపిస్తున్నారంటే.. కనీసం ఇంకో రెండు మూడు వేల కోట్లు ఏడాదికి స్వాహా చేస్తుంటారని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి లాజిక్ లేని నిందలతో చంద్రబాబు మీద విషం కక్కితే వారికే చేటు అని వైసీపీ మంత్రులు ఎప్పుడు తెలుసుకుంటారో?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles