డీజీపీ హింట్ : కేరళ తరహా శిక్షలే ఇక్కడ కూడా!

Tuesday, November 5, 2024

‘‘కేరళలో నేరం జరిగిన 20 ఏళ్ల తరువాత ఒకర ఐపీఎస్ అధికారికి శిక్ష విధించారు.. న్యాయం చేసేందుకే కోర్టులు చట్టాలు ఉన్నాయి’’!

ఏపీ డీజీపీ  నోటివెంట ఈ మాటలు యథాలాపంగా, అసందర్భంగా రాలేదు. ప్రెస్ మీట్ లో ఆయన ఈ కేరళ ఐపీఎస్ శిక్షలను ఉబుసుపోక ఉదాహరించలేదు. ఏపీలో కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ మాటల ద్వారా కేరళ తరహాలోనే.. కాలంగడిచినా కూడా.. నేరం చేసిన వారు శిక్షలు తప్పించుకోలేరు.. అని డీజీపీ ద్వారకా తిరుమల రావు హింట్ ఇస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఐపీఎస్ అధికారులు, చట్టసభల ప్రతినిధులు పలువురు కేసులు ఎదుర్కొంటున్నారు.

కాకపోతే.. వీరి మీద ఉన్న కేసులు తీవ్రమైనవే అయినప్పటికీ.. రెండుమూడేళ్ల కిందటివి. గడచిపోయిన ప్రభుత్వం కాలంలోనివి. కొన్ని ఆల్రెడీ మూసేసిన కేసులు. మరి ఇలాంటి కేసుల్లో ఇంతకాలం తర్వాత శిక్షలు పడడం సాధ్యమవుతుందా?  అనే సంశయాలు చాలా మందిలో ఉన్నాయి. కేసులు తిరిగి ఓపెన్ చేసి విచారణ నడిపిస్తున్నారే తప్ప.. దాని వల్ల తేలేదేమైనా ఉందా? అనునకుంటున్న నేపథ్యంలో డీజీపీ ఇలాంటి మాటలు ప్రకటించడం విశేషం.

తెలుగుదేశంపార్టీ ఆఫీసు, చంద్రబాబునాయుడు నివాసం మీద జరిగిన దాడి కేసుల్లో వైసీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు, నాయకులు నిందితులుగా ఉన్నారు. ‘ఎప్పుడో జరిగిపోయిన సంగతి.. ’ ఏం జరిగిందో గుర్తు లేదంటూ వారు విచారణలో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వాడిన ఫోన్లు కూడా తమవద్ద లేవని తేల్చి చెప్పేస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం సీఐడీ పరిధిలోనే ఉంది. చూడబోతే.. ఈ కేసులో ఇన్నేళ్ల తర్వాత వైసీపీ నేతలు నిందితులుగా అరెస్టులు జరగవచ్చునని అనుకుంటున్నారు.

అలాగే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదు కూడా గట్టిగానే తగులుకుంది. కాదంబరి జత్వానీని కేసుల్లో ఇరికించడానికి, తద్వారా ఆమెను బెదిరించి నవీన్ జిందాల్ పై పెట్టిన కేసులను వెనక్కు తీసుకునేలా చేయడానికి ఏపీ లోని ఐపీఎస్ అధికారులు అడ్డదారుల్లో సహకరించారు. నీతి బాహ్యంగా వ్యవహరించారు. కాదంబరి జత్వానీ విషయంలో ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయి విచారణ ఎదుర్కొంటున్నారు. కేరళ ఐపీఎస్ ఉదాహరణ ను గమనిస్తూంటే.. ఆయనకు 30 ఏళ్ల తర్వాతే శిక్ష పడినప్పుడు.. ఇంకా ఏడాది కూడా పూర్తికాని వ్యవహారంలో.. ఆధారాలు కూడా బలంగా కనిపిస్తుండగా.. జగన్ భక్త ఐపీఎస్ లకు కూడా శిక్షలు తప్పదని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles