గోవా నుంచి హైదరాబాద్‌ కు చేరుకున్న దేవర!

Sunday, December 22, 2024

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ట్రిపుల్‌ ఆర్‌ తరువాత చేస్తున్న పాన్‌ ఇండియా సినిమా దేవర. ఈ సినిమా మాస్‌, యాక్షన్‌ డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. అందుకే ముందుగా మొదటి భాగాన్ని అక్టోబర్‌ 10న దసరా కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు మూవీ మేకర్స్‌ సిద్దమవుతున్నారు.

దసరా నాటికి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం శరవేగంగా షూటింగ్‌ జరుపుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ గోవాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. అయితే ఆయన భాగం పూర్తి కావడంతో  ఆయన గోవా నుంచి  హైదరాబాద్ కు వచ్చారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా మీద కొరటాల శివతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హీరోలు ఏ సినిమా చేసినా అది పెద్ద డిజాస్టర్ అనే టాక్ చాలాసార్లు రుజువైంది. దాన్ని తప్పించుకునే ప్రయత్నం కోసం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు మరి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles