గళ్ల కోటు..నల్ల కళ్లజోడు!

Sunday, December 22, 2024

మరో రెండు రోజుల్లో ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభిమానులు ఈ వేడుకలను ఎంతో ఘనంగా మొదలు పెట్టారు.  జపాన్ లోని టోక్యోలో రాధే శ్యామ్ సినిమా చూస్తూ అక్కడి అభిమానులు ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి ప్రభాస్ పుట్టిన రోజు ఎల్లుండి అంటే అక్టోబర్ 23వ తేదీన.

కానీ అంతకు ముందుగానే పుట్టినరోజు సంబరాలను తీసుకొచ్చేందుకు రాజా సాబ్ టీం సిద్ధమైంది. మారుతీ దర్శకత్వంలో విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.  హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.  ముందుగా సంక్రాంతికి సినిమా విడుదల చేయాలనుకున్నారు కానీ సంక్రాంతికి వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితులు  ఉన్నాయి.

ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు మూవీ మేకర్స్‌. ఆ పోస్టర్లో ప్రభాస్ గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్టు ధరించి భలే ఉన్నాడు. మొదటిసారి దీపావళితో పాటు ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా ఒక పోస్ట్ విడుదల  చేశారు. ఆ పోస్టర్లో కూడా ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తూన్నాడు. ఇప్పుడు మరోసారి పుట్టినరోజు ముందు ట్రీట్ ఇచ్చేసారని చెప్పుకొవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles