హరిహర వీరమల్లు రిలీజ్‌ గురించి క్లారిటీ వచ్చేసింది!

Sunday, December 22, 2024

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాని నాలుగేళ్ల కిందట డైరెక్టర్‌ క్రిష్‌ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంది.ఈ సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదట్లో కొంతభాగం షూటింగ్ జరుపుకుని పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

ఆ తరువాత కొన్ని అనుకొని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా పవన్ ఇతర సినిమాలు చేయడంతో ఇక ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా ఈ సినిమా ఆగిపోలేదని మేకర్స్ టీజర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా మొఘలుల కాలం నాటి పీరియాడిక్  యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ సినిమా నుండి డైరెక్టర్‌ క్రిష్ పక్కకు తప్పుకున్నారు. ఈ సినిమాలో మొఘలులు ,నవాబులపై పోరాడే బందిపోటుగా పవన్ కల్యాణ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ పై నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ సినిమాను సెప్టెంబర్ ,అక్టోబర్ మధ్యలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles