చిరు-అనిల్… క్రేజీ న్యూస్

Andhrawatch
1 Min Read

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి ఓ కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్‌డేట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అనిల్ రావిపూడి స్టైల్లో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

చిరంజీవి ప్రస్తుతం యూకే టూర్‌లో ఉన్నా, మే 22 తర్వాత ఆయన తిరిగి వచ్చాక షూటింగ్ ప్రారంభమవుతుందట. ఆయన భారత్‌కు వచ్చిన వెంటనే చిత్ర బృందంతో కలిసి ప్రాజెక్ట్ మీద చర్చలు జరిపి, కీలకమైన కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో నయనతారతో పాటు కేథరిన్ త్రేజా కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక సంగీత బాధ్యతలు భీమ్స్ సిసిరోలియో తీసుకున్నాడు. ఈ కాంబినేషన్ మీద అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Share This Article