కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ అంటే సినిమా ప్రేమికులకు ప్రత్యేక Craze ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న భారీ సినిమా థగ్ లైఫ్ పై ఇప్పటికే మంచి హైప్ ఉంది. ప్రేక్షకుల్లో, ముఖ్యంగా తెలుగువారిలో ఈ సినిమాపై ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్లను షురూ చేసింది. తొలి పాటతోనే మంచి బజ్ తీసుకొచ్చారు. మేకర్స్ తెలుగులోనూ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించి, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతున్నారు.
ఇక కమల్ హాసన్ మాత్రం ఈ ప్రచారాల్లో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇతర నటులు కొంత విరామం తీసుకుంటే, కమల్ మాత్రం ఒకేసారి అన్నీ క్యాంపెయిన్లలో పాల్గొంటూ తన డెడికేషన్ చూపిస్తున్నారు. ఇది చూసినవాళ్లెవరైనా ఆయన సినిమా పట్ల ఉన్న నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాలో సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందించగా, సినిమా జూన్ 5న థియేటర్లలోకి రానుంది. కమల్, మణిరత్నం, రెహమాన్ ముగ్గురు కలిస్తే ఎలాంటి మ్యాజిక్ కుదిరుతుందో చూడాలి మరి.