మేయర్లకు చెక్ : అవిశ్వాసంతో కొందరు.. అవినీతితో కొందరు!

Thursday, March 27, 2025

జగన్ అధికారంలో ఉన్న అయిదేళ్లకాలంలో అన్ని రంగాలలో అరాచకత్వం రాజ్యమేలింది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరగాయో అందరికీ తెలుసు. పంచాయతీలు, మునిసిపాలిటీలను అరాచకత్వంతో అడ్డగోలుగా దక్కించుకున్నారు. తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు కనీసం నామినేషన్లు వేయడానికి కూడా వీల్లేకుండా అడ్డుకుని, కిడ్నాపులు చేసి.. నానా బీభత్సం సృష్టించి మొత్తానికి మెజారిటీ స్థానాలు గెలిచారు. ఇప్పుడు మునిసిపాలిటీలు ఒక్కటొక్కటిగా చేజారుతున్నాయి.

రాష్ట్రంలో అధికారం కూటమి చేతుల్లోకి వెళ్లిన తర్వాత.. ప్రతిచోటా మెజారిటీ సభ్యులు కూటమి పార్టీల్లోకి చేరుతున్నారు. నాలుగేళ్ల గడువు కూడా పూర్తయని చోట్ల అవిశ్వాసం పెట్టి మేయర్ స్థానాలను దక్కించుకునే ప్రయత్నం జరుగుతోంది. అదే సమయంలో..  మేయర్ లుగా ఉంటూ.. అడ్డగోలుగా అవినీతికి పాల్నడిన కారణంతో.. కొందరు మేయర్లు పదవిని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. మొత్తానికి అడ్డదారుల్లో అధికారం దక్కించుకున్న వారు.. అనతికాలంలోనే మరుగునపడిపోనున్నారు.

తాజాగా కడప మునిసిపల్ మేయర్ సురేష్ బాబుకు రాష్ట్రప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీచేసింది. విపరీతంగా అవినీతికి పాల్పడినట్టుగా తేలడంతో.. ఆయనను మేయర్ పదవినుంచి ఎందుకు తొలగించకూడదో.. 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ.. ఆ షోకాజ్ నోటీసులో  పేర్కొన్నారు.  ఈ షోకాజు నోటీసుకు జవాబు చెప్పాలంటూ.. కడపజిల్లా తెలుగుదేశం నేత, పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు.

కడప లో 50 డివిజన్లుండగా వైసీపీ అప్పట్లో 49 గెలుచుకుంది. కార్పొరేషన్ పై గుత్తాధిపత్యం ఉన్న మేయర్ సురేష్ బాబు ఇష్టారాజ్యంగా అయిన వారికి కాంట్రాక్టు పనులు దోచిపెట్టారనేది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. తన కుటుంబ సభ్యులకు కూడా కాంట్రాక్టులు కేటాయించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలవడంతో.. కడప కార్పొరేషన్ రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ సమావేశాలకు ఆమె హాజరు కావడం, మేయర్ ఆమెను అవమానించేలా ప్రవర్తించడం జరుగుతూ వస్తోంది.

మేయరు అక్రమాలపై, కాంట్రాక్టుల్లో దోచుకున్న తీరుపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో మేయర్ సురేష్ బాబు అవినీతి మొత్తం బట్టబయలు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ నివేదిక ఆధారంగా.. మేయర్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో.. సంజాయిషీ చెప్పాలంటూ.. సురేష్ బాబుకు షోకాజ్ పంపారు.
ఒకవైపు విశాఖపట్నం మేయర్ పదవిని అవిశ్వాసం ద్వారా కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కడప మేయర్ అవినీతి కారణంగా.. పదవిని కోల్పోయే ప్రమాదం కనపడుతోంది. వైసీపీ అరాచక వాదులు ఒక్కొక్కరు ఒక్కో కారణంగా పదవులు కోల్పోనున్నారని అర్థమవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles