జగన్మోహన్ రెడ్డి ‘ఒక్క ఛాన్స్’ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని చాలా శాస్త్రీయంగా, వ్యవస్థీకృతంగా దోచుకోవడం ప్రారంభించారు. ఒక ఏడాదికి పైగా భవన నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసేసి వందల మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు, ఆకలి చావులకు కారణమైన జగన్మోహన్ రెడ్డి ఒక నూతన ఇసుక పాలసీ తీసుకొస్తున్నాను అంటూ ప్రకటించి అడ్డగోలుగా విచ్చలవిడి దోపిడీపర్వానికి తెర లేపారు. అదే తరహాలో మద్యం పాలసీ గానీ, పేదలకు ఇళ్ల స్థలాల పేరిట సాగించిన భూమాఫియా దందాలు గాని.. అన్నీ ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో జరిగిన ద్రోహాలే, దోపిడీ చర్యలే. ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఈ-ఆఫీస్ అనే సాఫ్ట్ వేర్ ను ఇప్పటికిప్పుడు మార్చేయాలని జగన్ సర్కారు ఆరాటపడుతున్నది. వారి కుట్రలకు చంద్రబాబు నాయుడు సమర్ధంగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా రు.
ఇప్పటికిప్పుడు ఎందుకు సాఫ్ట్వేర్ అప్ గ్రేడేషన్ చేయాలో ప్రభుత్వం వద్ద వివరణ చెప్పడానికి ఒక్క మాట కూడా లేదు. ఎన్నికలు పూర్తయి ప్రభుత్వమే మారిపోతున్న తరుణంలో సాఫ్ట్ వేర్ అప్ గ్రేడేషన్ వ్యవహారంలో ఎందుకు తొందర పడుతున్నారనేది అనుమానాస్పదంగా ఉంది. జగన్ ప్రభుత్వపు సకల అరాచక వ్యవహారాలను ఈ అప్లికేషన్ నుంచి పూర్తిగా ఎరేజ్ చేసి, అక్రమాల విషయంలో జగన్ ఎప్పటికీ పట్టుబడకుండా చూడడానికి ఈ అప్ గ్రేడేషన్ అనే మాట ఒక కుట్ర అని పలువురు భావి స్తున్నారు.
అయితే ఎన్నికలలో విజయం పట్ల ఎంతో విశ్వాసంగా ఉన్న చంద్రబాబు నాయుడు.. జగన్ సర్కారు ఆటలను సాగనిచ్చేలా లేరు. ఈ పనిని ఇప్పుడు జరగకుండా ఆపాలని ఆయన ఏకంగా రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం పాల్పడుతున్న అనేక అరాచక అంశాల గురించి చీఫ్ సెక్రటరీకి పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నా ఎటువంటి ఫలితం ఉండడం లేదు. దీంతో చంద్రబాబు ఈ దఫా ఏకంగా గవర్నరుకే ఫిర్యాదు చేయడం గమనార్హం.
దీనికి సంబంధించి తాజా ఉత్తర్వులు ఏమి ఇంకా రాలేదు కానీ.. ప్రభుత్వం తొందరపడడం మాత్రం అనుమానాలను రేకెత్తిస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రజల తరఫున ప్రభుత్వ వ్యవహారాలకు, దోపిడీ ఆలోచనలకు ఒక చౌకీదారు పాత్ర పోషిస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాలు ఎరేజ్ చేసే కుట్రకు చంద్రబాబు చెక్ !
Wednesday, January 22, 2025