రూ.1750 కోట్ల లంచంపై ఏపీలో జగన్ పై కేసు!

Wednesday, December 25, 2024

రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం చెలరేగుతున్న సమయంలో.. జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా సకుటుంబంగా బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయి సేదతీరుతున్నారు. ఇంతకూ సేదతీరుతున్నారా? అక్కడ తనదైన అనుంగు సహచరులతో సరికొత్త వ్యూహరచన చేస్తున్నారా? అదానీతో మూడు సార్లు ప్రత్యేకంగా భేటీ అయి.. ఆయనకు బొకేలు వెంకటేశ్వస్వామి బొమ్మలు ఇవ్వడాలు.. అదానీ వెళ్లగానే.. ఆయన గ్రూపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేయబోతున్నదని.. రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించబోతున్నామని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసేయడాలూ.. ఈ సమస్త డ్రామాల్లోని తెరవెనుక బాగోతం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వ్యవహారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. దీనినుంచి బయటపడడం ఎలాగా? అని అంతా తలలు పట్టుకుంటున్నారు.

ప్రజల నమ్మకం ఎటూ పోయింది.. అమెరికా కేసులోకూడా జగన్ పేరు నిందితుడుగా చేరకుండా ఉంటే చాలునని వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. దేశంలో ఇప్పటికే దాదాపు లక్ష కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో జగన్ ఏ1 నిందితుడిగా విచారణలు ఎదుర్కొంటున్నారు. ఇంత భారీస్థాయి అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన నాయకుడు ఈ దేశంలో మరొకరు లేరు. అదానీ నుంచి ఒక్క డీల్ లో ఏకంగా 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్న మరో ముఖ్యమంత్రి కూడా లేరు. ఆయనకు పాతికేళ్ల పొడవునా కలిపి కట్టబెట్టినది దాదాపు లక్షకోట్లకు పైబడిన డీల్! అందుకే జగన్ అంత మొత్తం డిమాండ్ చేసి తీసుకోగలిగారు అని ప్రజలు అనుకుంటున్నారు. అయితే అమెరికాలో ప్రస్తుతానికి అదానీ గ్రూపునకు చెందినవారిపై కేసులు నమోదు అయ్యాయి. జగన్ పేరు కూడా చేరుతుందా లేదా ఇప్పుడే తేలలేదు.
అయితే.. ఈ అక్రమ ఒప్పందం ద్వారా.. రాష్ట్ర ప్రజల మీద నడ్డివిరిచే భారం మోపినందుకు ఇక్కడి రాష్ట్రప్రభుత్వమే కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఒప్పందం చేసుకున్నది సెకితోనే అయినప్పటికీ.. దాని ద్వారా అంతిమ లబ్ధి పొందేది అదానీ సంస్థలే అనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పసివాడికీ అర్థమైపోయింది. అయితే లంచమే 1750 కోట్లు తీసుకున్నారంటే.. ఆ దామాషాలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఎన్ని వేల కోట్ల భారం మోపిఉంటారో కదా? అనేది ఇంకా ఇదమిత్థంగా లెక్కతేలడం లేదు. అయితే, అమెరికాలో వెలుగు చూసిన ఈ అవినీతి తిమింగలాల బాగోతానికి సంబంధించి.. జగన్ పాత్రపై రాష్ట్రంలో కేసు నమోదు చేసి విచారించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి అవకాశాలను పరిశీలించాల్సిందిగా న్యాయనిపుణులను ఆదేశించినట్టు స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పడం గమనించాల్సిన సంగతి. ఆమెరికా కేసులోకి జగన్ పేరు ఎక్కుతుందో లేదో గానీ.. ఏపీలో కేసు నమోదు అయి విచారణ సాగితే మాత్రం.. జగన్ పరిస్థితి దబిడిదిబిడే అని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles