వైరల్‌ అవుతున్న బిగ్‌ బి అశ్వద్దామ లుక్‌!

Thursday, July 4, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . ఈ సినిమాని స్టార్‌ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ బిగ్గెస్ట్ పాన్‌ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు యాక్ట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చిత్ర బృందం బిజీ గా వుంది.

ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. రీసెంట్ గా ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని ఓ రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించి ప్రేక్షకులకు పరిచయం చేసారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ అనే కీలక పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే. అశ్వద్ధామ పాత్రను మేకర్స్ మధ్యప్రదేశ్ లోని నెమవార్,నర్మద ఘాట్ వద్ద గ్రాండ్ గా లాంచ్ చేసారు.ద్రోణ సుతుడైన అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అద్భుతంగా నటించారు.తాజాగా అశ్వద్ధామగా అమితాబ్ న్యూ లుక్ విడుదల చేయగా ప్రస్తుతం ఆ లుక్ బాగా వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles