అఖండ 2 కోసం బిగ్‌ బిడ్‌!

Thursday, December 4, 2025

నందమూరి బాలకృష్ణ హీరోగా, సంయుక్త మరియు భజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ – డివోషనల్ ఎంటర్‌టైనర్ “అఖండ 2 తాండవం”పై ప్రస్తుతం టాలీవుడ్ అంతా దృష్టి పెట్టింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో సెన్సేషన్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ సీక్వెల్‌పై మొదటి భాగం సక్సెస్ కారణంగా ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ నుంచి పోస్టర్ల వరకు ప్రతి అప్‌డేట్ కూడా భారీ హైప్‌ను సృష్టిస్తోంది. ఇక బిజినెస్ పరంగా చూస్తే, ఈ సినిమాకి థియేట్రికల్ రేంజ్ కూడా రికార్డ్ స్థాయిలో ఉందని టాక్. ముఖ్యంగా నైజాం ఏరియాలో అఖండ 2 హక్కులు సుమారు 36 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సినీ వర్గాల సమాచారం. ఈ డీల్ చూసి ట్రేడ్ సర్కిల్స్ ఆశ్చర్యపోతున్నాయి.

ఇంత భారీ రేట్ రావడం బాలయ్య మార్కెట్ ఏ స్థాయిలో ఉందో చూపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై న్యూట్రల్ ఆడియెన్స్ దగ్గర కూడా పాజిటివ్ వైబ్ ఉంది. టికెట్ రేట్లు కంట్రోల్‌లో ఉంటే, పబ్లిక్ టాక్ కూడా బాగుంటే, ఈ టార్గెట్‌ని అఖండ 2 సులభంగా దాటే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles