బాలయ్య పుట్టిన రోజుకి అదిరిపోయే ట్రీట్‌!

Sunday, December 22, 2024

నందమూరి నట సింహం బాలకృష్ణ గతేడాది భగవంత్‌ కేసరి సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్‌ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాని యంగ్‌ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ సాధించింది. ఇటీవలే ఈ సినిమా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో ద్విశతదినోత్సవం జరుపుకుంది. ఇదిలా ఉంటే బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్నారు.

ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగ వంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా కు సంబంధించి గ్లింప్స్‌ వీడియోను విడుదల చేసారు. ఈ గ్లింప్స్ లో బాలయ్య మాస్ లుక్, పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న కారణంగా బాలయ్య సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఫుల్ ఫోకస్ రాజకీయాలపై పెట్టారు.

ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో బాలయ్య మళ్ళి షూటింగ్ కు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే “జూన్ 10 ” బాలయ్య పుట్టిన రోజు  సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందని అభిమానులను అనుకుంటున్నారు. అయితే వారు ఊహిస్తున్నట్లుగానే బాలయ్య బర్త్ డే కి ఫ్యాన్స్ కు మేకర్స్ స్పెషల్ ట్రీట్ ఇచ్చే పనిలో ఉన్నారు.  NBK109 మూవీకి సంబంధించి టైటిల్, టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles