అండమాన్ లో షూటింగ్‌ జరుపుకోనున్న బుట్టబొమ్మ సినిమా!

Sunday, December 8, 2024

తెలుగు ఇండస్ట్రీ బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు చాలా కాలం నుంచి తెలుగు ఇండస్ట్రీలో సరైన హిట్‌ సినిమానే లేదు. టాలీవుడ్‌ లో ఆచార్య, రాధేశ్యామ్.. తమిళంలో బీస్ట్ బిగ్గెస్ట్‌ ప్లాప్‌ లుగా నిలిచాయి. వరుస ఫ్లాప్స్ పడుతుండడంతో ఆ మధ్య గుంటూరు కారం నుంచి కూడా ఈ ముద్దుగుమ్మను తప్పించారు. దాంతో ఒకప్పుడు చేతినిండా సినిమాతో బిజీగా ఉన్న పూజా.. ఇప్పుడు అవకాశాల్లేక అల్లాడుతోంది. సౌత్‌లో సినిమాలు లేకపోవడంతో హిందీలో సినిమాలు చేస్తున్నారు.

అయితే పూజా ఎప్పటినుంచో సౌత్  లో మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. తాజాగా బుట్టబొమ్మకు ఆ అవకాశం దక్కింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌ లో  తమిళ్ స్టార్ సూర్య కథానాయకుడిగా  ‘సూర్య 44’ వస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుందట. పూజా హెగ్డే, సూర్య కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి.

పూజా చివరగా తమిళంలో దళపతి విజయ్ బీస్ట్ సినిమాలో నటించింది. హిందీలో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో నటించింది. ‘సూర్య 44’ షూటింగ్ జూన్ 2న అండమాన్ దీవులలో ప్రారంభమవుతుంది. అండమాన్ దీవులు, ఊటీ, తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను టీమ్ ప్లాన్ చేసింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles