ఆ రూమార్‌ నిజమా?

Andhrawatch
1 Min Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక  కథానాయికగా  టాలీవుడ్ క్రియేటివ్ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2” గురించి అందరికీ తెలిసిందే.

సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో  కాలం గా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ విడుదలకి రోజులు దగ్గరకి వస్తున్న నేపథ్యంలో ఓ ఊహించని రూమర్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి నేపథ్య సంగీతం దేవిశ్రీప్రసాద్ కాకుండా థమన్ అందిస్తున్నాడు అంటూ షాకింగ్ టాక్ వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో కానీ దేవిశ్రీప్రసాద్ అభిమానులు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. ఆల్రెడీ పార్ట్ 1 కే క్రేజీ స్కోర్ ని దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే  పుష్ప 2 ఫస్ట్ టీజర్ లో కూడా మంచి స్కోర్ పడింది. కానీ ఇపుడు పాటలు వరకే తను స్కోర్ వరకు మరొకరు అనే వార్తలు ఒకింత షాకింగ్  విషయం అనే చెప్పాలి. మరి దీనిపై మాత్రం అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి అయితే ఉంది.

- Advertisement -

థమన్ కూడా పలు సినిమాలకి మంచి స్కోర్ అందించాడు కానీ దేవిశ్రీప్రసాద్ లాంటి టాప్ సంగీత దర్శకుడు ఉన్నపుడు కూడా అతని ప్లేస్ లో మరొకరిని ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది అనేదానికి కారణం ఇపుడు సస్పెన్స్ గా మారింది.

Share This Article