ఆ పాట లేదు!

Saturday, December 7, 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొద్ది రోజుల క్రితం  ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని కాకుండా తెలుగు యంగ్ బ్యూటీ శ్రీలీల డ్యాన్స్ చేయనుందనే వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఇక శ్రీలీల అయితే, బన్నీ పక్కన డ్యాన్స్ ఇరగ దీస్తుందని అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు మరో ఆసక్తికర వార్త నెట్టింట షికారు చేస్తుంది. పుష్ప-2 చిత్రం నుండి ఓ సాంగ్‌ను పూర్తిగా లేపేయనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో పాటు మరో పాట షూటింగ్ కూడా జరగాల్సి ఉంది. అయితే ఈ సినిమా రన్‌టైమ్ తగ్గించే క్రమంలో ఈ పాటను పూర్తిగా తీసేయాలని సుకుమార్ అండ్ టీమ్ అనుకుంటున్నారంట.

మరి ‘పుష్ప-2’ నుండి పక్కకుపెట్టిన పాట ఏంటనేది.. ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles