జక్కన్న భారీ ప్రాజెక్టు పై ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌!

Thursday, December 26, 2024

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, టాలీవుడ్‌ జక్కన్న, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో ఓ భారీ సినిమాని చేస్తున్నారనే విషయం ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. మరి రాజమౌళితో ఎప్పుడు నుంచో అనుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకి సెట్ అయ్యి పాన్ వరల్డ్ లెవెల్ హైప్ ని క్రియేట్‌ చేసుకుంది.

అయితే ఈ సినిమా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం అభిమానులకి ఇంకా ఏ క్లారిటీ లేదు. ఇంకో పక్క మహేష్ బాబు సరికొత్త మేకోవర్ అయితే అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ నటీ నటుల ఎంపిక ఏంటి అనేది దాదాపు క్లియర్ అయ్యిందంట.

మహేష్ సహా సినిమాలో కనిపించే నటీనటుల లిస్ట్ ని జక్కన్న ఫైనల్ చేసారనే టాక్‌ నడుస్తుంది. ఇలా ప్రతి అంశంలో రాజమౌళి అయితే పక్కా క్లారిటీగా సినిమా పనులు చేసేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles