వారంతా ప్రేమతో చేయడం లేదు..కేవలం ఫేమ్‌ ను పెంచుకోవడానికే!

Saturday, January 18, 2025

బాలీవుడ్‌ గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నోరా  తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్‌ హిట్‌ అయిన “బాహుబలి 1” లో మనోహరి సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ హీరోయిన్  గా అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో “మట్కా” సినిమా లో నటిస్తుందిం.

తాజాగా ఈమె బాలీవుడ్ జంటలపై చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ… బాలీవుడ్ కపుల్స్ చాలా మంది ప్రేమలో లేరని  వారంతా కేవలం తమ ఫేమ్ ని పెంచుకోడానికి తమ నెట్వర్క్ ని పెంచుకోవడం కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ షాకింగ్‌ కామెంట్లు చేసింది.

దీంతో బాలీవుడ్ లో ఉన్న పలు జంటల పై నార్త్ ఆడియెన్స్ కి  అనుమానాలు మొదలయ్యాయి.అంతేకాకుండా కొందరు అయితే నోరా చెప్పింది అక్షర సత్యం అని కూడా అంటున్నారు. మొత్తానికి అయితే బాలీవుడ్ జంటల విషయంలో నోరా ఫతేహి చేసిన ఈ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాతో పాటు అటు  బాలీవుడ్ వర్గాల్లో కూడా వైరల్ గా మారిపోయాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles