అతి చేయడం వల్లనే భ్రష్టు పట్టిపోయిన హేమ!

Sunday, June 30, 2024

తెలుగు సినీ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయిన సంగతి అందరికీ తెలుసు. రేవ్ పార్టీ మీద పోలీసులు దాడి చేసి మొత్తం 103 మందిని అరెస్టు చేసిన రోజునే.. హేమ కాస్త అతిగా బిహేవ్ చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో తన పేరు వినిపిస్తున్నదని.. తాను అసలు అక్కడికి వెళ్లనే లేదని, తాను హైదరాబాదులోనే ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని వీడియో మెసేజ్ విడుదల చేసిన హేమ.. కేవలం ఆ కారణంగా మరింతగా ఆ కేసులో కూరుకుపోయారు. ఒకవైపు పోలీసుల అదుపులోనే ఉంటూ, తప్పుడు వీడియో మీడియాకు పంపడం ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం చేసినందుకు బెంగుళూరు పోలీసులు మరింత సీరియస్ అయ్యారు.
తాజాగా హైదరాబాదులో హేమను అరెస్టు చేసి పోలీసులు తీసుకువెళ్లడం జరిగింది. పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు కూడా హేమ చాలా అతి చేయడం ఆమెను మరింతగా భ్రష్టు పట్టించేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బెంగళూరు అరెస్టు తర్వాత హేమ ప్రజలను తప్పుదారి పట్టించేలా వీడియో విడుదల చేశారు. అయినా ఆమె పోలీసులు అదుపులో ఉన్నట్లుగా వైద్య పరీక్షలకు పంపిన శాంపిల్స్ పాజిటివ్ వచ్చినట్లుగా బెంగళూరు పోలీసులు వెల్లడించారు. అయితే సోమవారం నాడు అరెస్టు సందర్భంగా ఆమె దగ్గర మళ్లీ శాంపుల్స్ తీసుకున్నారు. తన నుంచి ఇప్పుడే పరీక్షల నిమిత్తం శాంపిల్స్ తీసుకున్నారని ఇప్పటిదాకా మీడియాలో వచ్చినవన్నీ అబద్ధాలేనని.. శాంపిల్స్ పాజిటివ్ గా తేలుతాయా నెగటివ్ గా తేలుతాయా అనేది తర్వాత తెలుస్తుందని హేమ అక్కడ గుమికూడిన మీడియా ప్రతినిధుల మీద చిందులు వేయడం జరిగింది.
అయితే ఈ ఎపిసోడ్ లో తొలి నుంచి కూడా కేవలం సరైన అవగాహన లేకపోవడం కారణంగా అతిగా స్పందిస్తూ హేమ మళ్లీమళ్లీ అభాసుపాలైనట్లుగా ప్రజలు భావిస్తున్నారు. డ్రగ్స్ తో సంబంధం ఉన్న ఇలాంటి కేసుల్లో దొరికినప్పుడు ఎంత సైలెంట్ గా ఉంటే అంతగా సేఫ్టీ జోన్లో ఉంటారని.. హేమ రంకెలు వేయడం వల్లనే ఎక్కువగా పబ్లిసిటీ జరిగిందని పలువురు అంటున్నారు. బెంగళూరు పోలీసులను కూడా మాయ చేసి తప్పుదారి పట్టించవచ్చునని తొలుత అనుకున్నారేమో గానీ.. తన పాచిక పారకపోయేసరికి హేమ ఇప్పుడు ఎవరు కనిపిస్తే వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా స్వయంకృతమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles