పెళ్లికి ముందే తల్లినయ్యా అంటున్న ముద్దుగుమ్మ!

Sunday, December 22, 2024

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి  2017 నవంబర్‌లో ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ స్టార్ కపుల్ జనవరి 2021లో కుమార్తె వామికకు జన్మనిచ్చారు. కోహ్లీ-అనుష్కలకు 2024 ఫిబ్రవరి 15న  అకాయ్ అనే కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం కుమార్తె, కుమారుడితో కలిసి అనుష్క లండన్‌లో ఉంటున్నారు. అయితే ఓ తాజా ఇంటర్వ్యూలో అనుష్క షాకింగ్‌ కామెంట్లు చేశారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ మాట్లాడుతూ.. తనను తాను ఓ మంచి తల్లిగా పేర్కొన్నారు. తాను పెళ్లికి ముందే తల్లిని అయ్యా అని చెప్పుకొచ్చారు. ‘నేను పెళ్లికి ముందే తల్లిని అయ్యా. ఇదంతా రణబీర్ కపూర్ వల్లే. సినిమా షూటింగ్ సమయంలో రణబీర్ మేకప్ రూమ్‌కి వచ్చి.. నా బ్యాగ్‌ మొత్తం గందరగోళం చేసేవాడు. నేను ఫోన్‌లో ఏదో చూస్తుంటే.. నా వద్దకు వచ్చి చిలిపి పనులు చేసేవాడు. అతడి అల్లరి, చిలిపి పనులను నేను తట్టుకున్నా. చిన్నపిల్లాడు రణబీర్ అల్లరిని భరించినప్పటి నుంచి నాలో మంచి తల్లి ఉందని గ్రహించా’ అని అనుష్క చెప్పుకొచ్చారు.

2017 పెళ్లి అనంతరం అనుష్క పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. గతేడాది చివరలో వచ్చిన ‘యానిమల్’తో రణబీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆలియా భట్, రణబీర్ దంపతులకు ఓ కూతురురాహా ఉన్న విషయం తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles