Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the td-cloud-library domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/nginx/domains/andhrawatch.com/public/wp-includes/functions.php on line 6121
అక్కినేని వారి ఇంట పెళ్లి భాజాలు..త్వరలోనే! - Andhrawatch.com

అక్కినేని వారి ఇంట పెళ్లి భాజాలు..త్వరలోనే!

Monday, May 19, 2025

అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య 2021 అక్టోబరు లో సమంతాతో విడాకులు తెలుసుకున్నాక సింగిల్ గానే ఉంటున్నాడు. వరుస సినిమాలతో కెరీర్ పరంగా ముందుకుదూసుకుపోతున్నాడు. అయితే గత కొన్ని నెలలుగా చైత్యన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాలు వార్తలు వినిపించాయి. ఆ విషయమై పలు ఇంటర్వ్యూ లలో ప్రశ్నించగా ఆ వార్తలను చైతూ కొట్టి పారేసాడు. కానీ నేడు వాటిని నిజం చేస్తూ బంధుమిత్రుల సమక్షంలో తన ప్రియురాలు శోభిత ధూళిపాళ్ల చేతికి ఉంగరం తొడిగాడు.

కొన్ని సంవత్సరాల ప్రేమాయణం తర్వాత నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. అక్కినేని నాగార్జున, అఖిల్, అమలతో పాటు, ధూళిపాళ్ల కుటుంబాలకు చెందిన ముఖ్యులు, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అతి కొద్దీ మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సాంప్రదాయాలకు దగ్గరగా వేదపండితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది.

ఈ వేడుకకు నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా హాజరయినట్టు సమాచారం. కొన్ని కారణాల రీత్యా ఎంగేజ్‌మెంట్‌కు మీడియాను అనుమతించలేదు. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి వెల్లడించనున్నట్టు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles