స్పిరిట్‌ పై రెండు క్రేజీ న్యూస్‌ లు!

Friday, December 5, 2025

పాన్ ఇండియా హీరో ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో త్వరలోనే ప్రారంభం కానున్న సినిమా స్పిరిట్. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి సినిమా ప్రేమికుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. ఈ సినిమా ఎప్పుడైతే మొదలవుతుందా, ఏ అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నాడు. ఈ కథకు తగ్గట్టుగా, స్పిరిట్ సినిమాను ఒకే భాగంగా కాకుండా రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచనపై మేకర్స్ పని చేస్తుండటమే తాజా టాక్. కథ వ‌రుసగా సాగేందుకు, భావోద్వేగాలు ఎక్కువగా చూపించేందుకు ఇలాంటిది అవసరమవుతుందని చిత్రబృందం భావిస్తోందట.

ఇదిలా ఉండగా, సందీప్ రెడ్డి గతంలో తెరకెక్కించిన యానిమల్ కూడా పార్ట్‌లలో ప్లాన్ చేశారు. ఆ సినిమా మొదటి భాగమే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే విధానం స్పిరిట్ సినిమాకూ అనుసరించనున్నారని సమాచారం. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన రావాలి మరి. కానీ ఒకవేళ ఇది నిజమైతే, ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది మ‌రొక మంచి వార్తే అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles