వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజల్లోనే లేని ఆవేదనకు సంబంధించి తాను కన్నీళ్లు కార్చడం, పోరాటాలు చేయడం అనేది ఒక రాజకీయ టెక్నిక్ గా మార్చుకున్నారు. నిజానికి ప్రజల్లో లేని వ్యతిరేకతను తన పోరాటాల్లో చూపించాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన పోరాటాలు విఫలం అవుతున్నాయి. దానికి తోడు.. ఆయన సరికొత్త ఎత్తుగడ ఏంటంటే.. తాను చేసిన మోసాన్ని కవర్ చేసుకోవడానికి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకోవడం.
ఆయన పోరాటానికి పెట్టిన ముహూర్తం ముంచుకువచ్చేలోగా.. తాను చేసిన మోసాలకు సంబంధించి వివరాలన్నీ బయటకు రావడంతో.. ఇప్పుడు పోరాటాన్ని వాయిదా వేసుకున్నారు. తమ మోసాన్ని కప్పి పుచ్చుకోవడానికి, కొత్త గడువు తేదీలోగా.. ఒక వాదన తయారుచేసుుకునే ప్రయత్నంలో ఉన్నారు.
జగన్ కరెంటు చార్జీలు పెరగడం లాంటి అంశాల మీద ఇప్పటికే రెండు ప్రజా పోరాటాలు నిర్వహించారు. అవి ఎలా జరిగాయో.. ప్రజలకు తెలుసు. ఇకపోతే.. ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు నిర్వహించాలంటూ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చి ఉన్నారు. ఒకేసారి మూడు పోరాటాలకు పిలుపు ఇచ్చిన జగన్ ఫీజు పోరును ఫిబ్రవరి 5కు షెడ్యూలు చేశారు. తాజాగా దానిని మార్చి 12 కు వాయిదా వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కొన్ని జిల్లాల్లో అమల్లో ఉన్నది గనుక.. వాయిదా వేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు గానీ.. అసలు కారణాలు వేరే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ కాలంలోనే.. ఫీజు రీఇంబర్స్ మెంట్ సొమ్ములను దాదాపు మూడువేల కోట్ల వరకు బకాయి పెట్టారు. విద్యార్థులకు చెల్లించడానికి ఆయన భారీ బహిరంగసభలు ఏర్పాటుచేసి బటన్ నొక్కే పనులు చేశారు గానీ.. నొక్కబడిన బటన్ తాలూకు ఫలితం కనిపించలేదు. వారి ఖాతాలకు డబ్బులు చేరలేదు. బటన్ నొక్కుడు కేవలం ఒక మాయగానే మిగిలిపోయింది. ఈలోగా ఎన్నికలు వచ్చేశాయని చెప్పి.. నిధుల విడుదల ఆగిపోయింది. ఎన్నికలకు ముందు ఆరకంగా మూడువేల కోట్ల ఫీజు బకాయిలు ఎగ్గొట్టి నాటకం నడిపించారెు జగన్మోహన్ రెడ్డి.
ఎన్డీయే సర్కారు ఏర్పడిన తర్వాత.. తొలినాటినుంచి ఫీజు బకాయిలు ఇవ్వాలని అనడం ప్రారంభించారు. అయితే జగన్ కుట్ర పూరితంగా కొత్త ప్రభుత్వం మీద మోపిన భారం విషయంలో ఎన్డీయే సర్కారు క్లారిటీతోనే ఉంది. ఆ విషయం వారు పట్టించుకోలేదు. అదే సమయంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలానికి సంబంధించి 800 కోట్ల రూపాయల ఫీజు రీఇబంబర్స్ మెంట్ నిధులను విడుదలచేశారు కూడా. ఈ వాస్తవాల్ని ఇటీవల నారా లోకేష్ మీడియాకు ప్రకటించారు కూడా. జగన్ బకాయిల విషయంలో వారు నిర్ణయం తీసుకోలేదు. అలాగని తమ ప్రభుత్వం ఫీజులు ఎగ్గొట్టకుండా సకాలంలో చెల్లించారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎగ్గొట్టిన డబ్బులకు సంబంధించి పోరాటం సాగించడం అంటే.. తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవుతుందని, ప్రజల ఎదుట పరువు పోతుందని జగన్ భయపడ్డారు. అందుకే లండన్ నుంచి తిరిగొచ్చిన తరువాత 5వ తేదీ తలపెట్టిన ఫీజు పోరు వాయిదా వేసుకున్నారు. మార్చి 12న నిర్వహిస్తాం అని చెబుతున్నారు. అప్పటికి జరుగుతుందో లేదో తెలియదు. కాకపోతే ఈలోగా.. నేరం తమది కాదని, చంద్రబాబుదేనని చెప్పడానికి ఒక వాదన తయారుచేసుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
