జ్యోతిర్లింగాల యాత్రలో ‘కన్నప్ప’ చిత్ర బృందం!

Friday, December 5, 2025

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా భారీ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప”. ఈ సినిమా కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. అయితే, కన్నప్ప సినిమా విడుదలకు ముందు దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోబోతున్నట్లు హీరో విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీమ్ దర్శించుకుంది.

అలాగే బద్రీనాథ్, రిషికేశ్‌లను కూడా సందర్శించారు. మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు చిత్ర బృందం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. కాగా ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles