నవంబర్‌ లో పుష్ప నుంచి 3 ట్రీట్‌ లు!

Friday, October 25, 2024

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ సినిమా ‘పుష్ప-2’ గురించి ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు. ఇక క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చిత్ర నిర్మాతలు మీడియా ముందుకు తీసుకుని వచ్చారు. ‘పుష్ప-2’ సినిమాని డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అంతేగాక ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తున్నామని.. అలాగే నవంబర్ నెలలో ‘పుష్ప-2’ మేనియా కొనసాగుతుందని వారు చెప్పారు. నవంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలతో పాటు ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

దీంతో అభిమానులు ఇక ‘పుష్ప-2’ ఫీవర్‌తో ఊగిపోయేందుకు రెడీ అవుతున్నారు. అందాల భామ రష్మిక  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles