సిద్దు కోసం రంగంలోకి తమన్‌!

Thursday, September 19, 2024

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ”తెలుసు కదా” రెగ్యూలర్‌ షూటింగ్‌ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన డైరెక్టర్‌ గా పరిచయం కాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నట్టు సమాచారం.

తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను షూట్ చేయడం చిత్ర బృందం మొదలు పెట్టింది. థమన్ స్కోర్ చేసిన చార్ట్‌బస్టర్ సాంగ్ కు కేకే లిరిక్స్ అందించారు. ఇటీవలే నా సామి రంగాతో దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ బిన్నీ పెద్ద సెట్‌లో చిత్రీకరిస్తున్న పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ పాటకు సిద్ శ్రీరామ్ తన గాత్రం అందించనున్నారు.

30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్ లో అనేక సన్నివేశాలతో పాటు పాట షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మామూలుగానే స్టైలిష్ గా ఉండే సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో తన పాత్ర కోసం మరింతగా స్టైలిష్ తయారయ్యారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరోపక్క ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles