ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్‌ దే అంటున్న ముద్దుగుమ్మ!

Saturday, December 7, 2024

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా , డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోలో తెరకెక్కిన సినిమా మిస్టర్‌ బచ్చన్‌.ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పాన్‌ వరల్డ్‌ సినిమాగా మూవీ మేకర్స్‌ తీర్చిదిద్దారు. అయితే మిస్టర్‌ బచ్చన్‌ మూవీతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి.  తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ గురించి మాట్లాడుతూ.. ‘మిస్టర్ బచ్చన్ పూర్తి కథని దర్శకుడు హరీష్ శంకర్ తనకు నేరేట్ చేయలేదని ఆమె ఓ క్లారిటీ ఇచ్చింది. కేవలం తన క్యారెక్టర్ కి సంబంధించిన అవుట్ లైన్ మాత్రమే డైరెక్టర్‌ చెప్పుకొచ్చారని ఆమె వివరించింది. ఓ విధంగా హరీష్ శంకర్ తనకి గురువు అని భాగ్యశ్రీ పొగడ్తలతో ముంచేసింది.

హరీష్ శంకర్ స్క్రీన్ పై తనని చాలా అందంగా చూపించారని పేర్కొంది. స్క్రీన్ మీద నేను ఎలా కనిపించిన దాని కంప్లీట్ క్రెడిట్ అంతా కూడా హరీష్ శంకర్ కే దక్కుతుందని భాగ్యశ్రీ చెప్పింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles