ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికల సీజనులో మరొక మాట చెప్పేవ్యక్తి కాదు జనసేనాని పవన్ కల్యాణ్. వాలంటీర్ల వ్యవస్థలో లోపాలు ఉన్నాయని మొదటగా ఎత్తిచూపించిన వ్యక్తి ఆయన. ఆ వ్యవస్థలో భాగంగాఉన్న వాలంటీర్ల సేవలను వినియోగించుకోవడంలో లోపం జరుగుతోందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్మార్గం అందులో చోటు చేసుకుంటున్నదని తొలుత ఆరోపించినది పవన్ కల్యాణే. ఆ రకంగా, తొలినాళ్ల నుంచి కూడా.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. 32 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయ్యారని పవన్ చెబుతూనే ఉన్నారు. ఈ అదృశ్యాల వెనుక పెద్ద రాకెట్ ఉన్నదని.. వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న సమాచారాలు ఆ రాకెట్ చేతిలోకి వెళ్లడం వలన ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పవన్ తొలినాళ్లనుంచి చెబుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం ఎన్నడూ నామమాత్రంగానైనా స్పందించలేదు. దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా పవన్ అదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ.. ఈ ప్రశ్నకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ జవాబు చెప్పలేరని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
రకరకాల ప్రలోభాలకు, వ్యవహారాలకు రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డలు 32 వేల మంది మాయమైపోయారన్న మాట నిజం. ఒక ఆడబిడ్డ మాయం అయితే దాని ప్రభావం, ఆ వేదన కనీసం రెండు మూడు కుటుంబాల మీద తప్పకుండా ఉంటుంది. అంటే ఇంచుమించుగా రాష్ట్రంలో లక్ష కుటుంబాలలో తమ ఇంటి ఆడబిడ్డలు మాయమైపోయారనే వేదన నిండి ఉన్నట్టు లెక్క. ఇంత ఘోరం గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తూంటే.. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మాత్రం కిమ్మనడం లేదు. అస్సలు స్పందించడం లేదు.
ఇప్పుడు పవన్ మాటల ద్వారా వాస్తవాల్ని గ్రహిస్తున్న ప్రజలు అధికార పార్టీని క్షమిస్తారా? ఇలాంటి అరాచకాలకు పాల్పడినందుకు వారిని ఊరికే విడిచిపెడతారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఆడబిడ్డలు మాయమైపోయారు కదా అనే ప్రశ్నకు సీఎం జగన్ జీవితంలో ఎప్పటికీ సమాధానం చెప్పలేరని, తన పార్టీ వారి అరాచకాలకు కాపు కాయడమే ఆయనకు ఇష్టం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ తన ఎన్నికల సభల్లో జగన్ తీరు మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దేశం దాటి వెళ్లాలంటే.. కోర్టు అనుమతి తీసుకోవాల్సిన వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారంటూ పవన్ ఎద్దేవా చేశారు.
జగన్ ఎప్పటికీ జవాబు చెప్పలేని ప్రశ్న అది!
Thursday, November 21, 2024