ఎంపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత!

Saturday, November 16, 2024

ప్రభుత్వాల అవినీతిని, అరాచకత్వాన్ని ప్రశ్నించడానికే తమ పార్టీ పుట్టిందని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుంటారు. ఆయన స్వయంగా అదే పనిచేస్తుంటారు. ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తుంటారు. తన ఉద్యమగళాన్ని వినిపిస్తుంటారు. ప్రభుత్వ అరాచకాల్ని ప్రజలసాక్షిగా నిలదీస్తుంటారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా అధికార పార్టీ లాగేసుకున్నదని, అయినా సరే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రం ఆపేది లేదని పవన్ నిరూపిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. జనసేన తరఫున చిత్తశుద్ధి గల కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో ఉండి ఉంటే.. ఇంకెంతగా ప్రభుత్వా అరాచకాల్ని అడ్డుకునే వారో కదా అనిపిస్తుంటుంది. ఆ విషయం సత్యం అని నిరూపిస్తూ విశాఖ పట్నానికి చెందిన జనసేన నాయకుడు , స్థానిక ఎంపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఆయన అవినీతిని చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు.

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ లో జనసేన పార్టీకి ముగ్గురు కార్పొరేటర్ల బలం ఉంది. వారిమీద కూడా ఎరవేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి గానీ.. వారు ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా.. జనసేనకు కట్టుబడి కొనసాగుతున్నారు. వారిలో కార్పొరేటర్ మూర్తియాదవ్ కూడా ఒకరు. ఆయన స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఒక చిత్రమైన సవాలు విసిరారు. అవినీతి గురించి.. నామీద చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించండి అని .. సాక్ష్యాలు చూపించండి అని.. రొటీన్ గా నాయకులు చేసే సవాళ్ల లాంటిది కాదు ఇది.

తన వార్డులో ఒక కార్పొరేటర్ గా తాను చేసినంతటి అభివృద్ధి పనులను.. నాలుగేళ్లుగా ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యానారాయణ విశాఖ నగరానికి చేసి ఉంటే వాటిని నిరూపించాలని మూర్తి యాదవ్ సవాలు విసిరారు. అచ్చంగా అభివృద్ధికి సంబంధించిన సవాలు ఇది. తాను తన వార్డులో చేసినన్ని పనులు, ఎంపీ ఎంవీవీ చేసి ఉంటే గనుక.. తాను ఏకంగా రాజకీయాలనుంచి విరమించుకుంటానని ఆయన పేర్కొనడం విశేషం.

ఈ క్రమంలో భాగంగా.. ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుని ఎంవీవీ మూర్తి ఎన్ని దందాలు చేస్తున్నారో.. తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అండదండలుగా ఎలా ఎంపీ పదవిని వాడుకుంటున్నారో మూర్తి యాదవ్ చాటిచెప్పడం విశేషం. వివాదాస్పద స్థలంలో నగర శివార్లలో ఎంపీ వేసిన ఎంవీవీ సిటీ వెంచర్ కు రెండు వైపులా విశాలమైన రహదారుల్ని ప్రభుత్వ సొమ్ముతో వేయించారని మూర్తి విమర్శించారు. కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయలు అందుకోసం కాజేశారని అంటున్నారు. హయగ్రీవ భూములను, క్రైస్తవ భూములను కూడా ఎంపీ పదవి అడ్డుపెట్టుకుని కాజేసారని మూర్తి యాదవ్ విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ తరఫున కార్పొరేషన్ లో సభ్యుల సంఖ్య తక్కువేగానీ.. వారు అరాచకాలకు పాల్పడేవారికి చుక్కలు చూపిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

వార్డులో తానుచేసిన అభివృద్ధి పనుల్లో కనీసం సగమైనా.. యావత్ విశాఖ లోక్ సభ పరిధిలో ఎంపీ చేసినట్టుగా నిరూపించగలరా అని మూర్తి యావ్ అంటున్నారు. తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాదు వెళ్లి వ్యాపారం చేసుకుంటానని అంటున్న ఎంపీ గారూ.. మూర్తి యాదవ్ సవాలు మీకు వినిపిస్తోందా?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles