కులాలు మతాలు పేదల మహిళలు ఆటోడ్రైవర్లు లాయర్లు, బడికి వెళ్లే విద్యార్థుల కుటుంబాలు.. ఇలా రకరకాల పేర్లు చెప్పి.. జగనన్న ఎందరికి ఎంతెంత పెద్ద వరాలు ప్రకటించారనేది ప్రభుత్వం కొన్ని వందల వేలరూపాల్లో ప్రచారం చేసుకుంటూనే ఉంది. కానీ… ఇలాంటి పేద ధనిక, చిన్నా పెద్దా తారతమ్యాలు ఏమీ పట్టించుకోకుండా.. ఏపీలో ఉన్న ప్రతి మనిషికీ, ఆ మాటకొస్తే పుట్టబోయే బిడ్డతో సహా ప్రతి ఒక్కరికీ కూడా జగనన్న ఒక పెద్ద వరం ఇచ్చేసినట్టే లెక్క. అదేంటో తెలుసా.. ప్రతి తలకీ ఇంచుమించుగా లక్ష రూపాయల అప్పు.
ఒక రాష్ట్రం పరిపాలన సాగించే క్రమంలో చేసే అప్పులు ప్రతిసారీ విపక్షాలకు అస్త్రాలుగా మారుతుంటాయి. ప్రతినెత్తిమీద ప్రభుత్వం ఇంతింత అప్పు పెట్టేసిందంటూ.. వారు యాగీచేస్తుంటారు. ఇలా విపక్షాలు ప్రకటించే తలసరి అప్పుల వివరాల్లో కాకుల లెక్కలు ఉవంటే ఉండవచ్చు గాక.. కానీ తాజాగా ఏపీ అప్పుల గురించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) వివరాలు ప్రకటించింది. ప్రజలు బెంబేలెత్తిపోయే వాస్తవాలు అందులో ఉన్నాయి.
ఏపీ రాష్ట్రప్రభుత్వం రిజర్వుబ్యాంకులో కనీస నగడు నిల్వలు నిర్వహించడానికి దాదాపుగా ప్రతిరరోజూ అప్పలు చేయాల్సి వస్తున్నదని కాగ్ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వద్ద కనీస నిల్వ 1.94 కోట్లరూపాయలుండడం తప్పనిసరి కాగా, దాన్ని మెయింటైన్ చేయడానికి సాధ్యం కాక ఏపీ సర్కారు నానా పాట్లు పడుతోంది.అడ్వాన్సులు ఓవర్ డ్రాఫ్టులు ఇలా రకరకాల మార్గాల్లో క నీస నిల్వ భర్తీ చేస్తుంది. ఇలా ఏడాదిలో 322 రోజుల పాటూ నగదు నిల్వ మెయింటైన్ చేయడానికి అప్పుల్లో బతకడమే ప్రభుత్వానికి సరిపోతోందని కాగ్ హెచ్చరించడం ప్రస్తావనార్హం. కనీసం రిజర్వు బ్యాంకులో డబ్బు నిల్వలు పెట్టడానికైనా సరైన వ్యవస్థను ఏర్పాటుచేసుకునేలా ప్రభుత్వం ప్రయత్నించాలని కాగ్ హితవు చెప్పడం అవమానకరం కూడా.
కాగ్ చెప్పిన మొత్తం సంగతుల్లో అప్పుల గొడవలు, బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు సామాన్యులకు అర్థమయ్యే సంగతులు కాదు. కానీ.. రాష్ట్రంలో తలసరి అప్పు అతి భయంకరంగా పెరిగిపోయిందనే వాస్తవం ప్రమాదఘంటికలు మోగించేటువంటిది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రరూ.92797 రూపాయల రుణభారం ఉన్నదని కాగ్ ప్రకటించింది. ఇది మామూలు సంగతి కాదు.
జగన్ సర్కారు ఏ పేద ఇంటికి ప్రభుత్వ పథకాల రూపేణా పదిరూపాలు ఇచ్చినాసరే.. దానిని ప్రత్యేకంగా లేఖ రూపంలో తయారుచేసి.. ఎమ్మెల్యేలను ఇంటింటికీ తిప్పి, మీ కుటుంబానికి మాసర్కారు ఇన్నేసి వేల లక్షల రూపాయలు ఇచ్చింది అంటూ లెక్కలు చెప్పిస్తోంది. పెన్షన్లు, పథకాలు, రేషన్ లబ్దితో సహా సమస్తం ఈ సాయంలో కలిపేసి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. అయితే లబ్ధిదారులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వం నుంచి పైసా కూడా పొందని సామాన్యులు అందరినీ కలిపి.. ప్రతి ఒక్కరి నెత్తి మీద ఏకంగా దాదాపు రూ.లక్ష అప్పుభారం పెడుతున్నదంటే.. ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి.
జగనన్న ఇచ్చిన పదోరత్నం ‘రూ.లక్షఅప్పు’!
Monday, December 23, 2024