టాలీవుడ్ లో సినిమా అంటేనే హీరో బేస్డ్ గా నడిచే వ్యాపారం. హీరో లేకుండా కేవలం డైరక్టరు హవాను బట్టి నడిచే సినిమాలు చాలా కొద్ది మాత్రమే ఉంటాయి. అలాంటి దర్శకులు మనకు చాలా తక్కువ. అయితే ప్రతి ఒక్కరూ తాము రాజమౌళి స్థాయి దర్శకులమే అని.. రెండుకోట్ల సినిమాకైనా.. రెండొందల కోట్ల సినిమాకైనా దర్శకుడు చేసే పని ఒకేరీతిగా ఉంటుందని చెప్పుకుంటూ బతికేవాళ్లు కూడా కొందరుంటారు.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఒక చిత్రంలో దర్శకుడికి- కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోకి మధ్య పొసగక పబ్లిసిటీ ని మొత్తం గందరగోళంగా తయారుచేసిన వైనం చిత్రంగా కనిపిస్తోంది.
కామెడీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు ఉన్న శివనాగేశ్వరరావు.. చాలా కాలం గ్యాప్ తర్వాత.. బ్రోచేవారెవరురా అనే చిత్రం తీశారు. ఈ చిత్రంలో ప్రణవచంద్రను హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. సినిమా మేకింగ్ సమయంలో ఇద్దరికీ చెడింది. అసలే సినిమా మేకింగ్ చాలా ఆలస్యం అయి ఇవాళ్టికి విడుదలకు వచ్చింది.
ఈలోగా వీరి మధ్య ఎంతగా రిలేషన్స్ చెడ్డాయంటే.. బయటి కార్యక్రమాల్లో కనిపించినా, తారసపడినా ఒకరినొకరు పలకరించుకోవడం కూడా మానేసి.. మొహం పక్కకు తిప్పుకుని వెళ్లసాగారు. అంత ఘోరంగా అయింది. తీరా సినిమా పబ్లిసిటీ వచ్చేసరికి.. దర్శకుడు కత్తెర తన చేతిలో ఉంటుందనే సంగతి గ్రహించారు. హీరో బొమ్మ కూడా కనిపించకుడా అనేక టీవీ యాడ్లను కట్ చేయించి రిలీజ్ చేశారు. ఒకరిద్దరు కమెడియన్లతో నేలబారు కామెడీ అనిపించే సీన్లనే ప్రోమోస్ గా కట్ చేశారు. హీరోతో ఒకే ఒక్క ప్రోమో.. కొత్తగా డెబ్యూ సినిమా చేస్తున్న హీరోతో చేసిన ప్రోమోలో.. అతనెవరో ప్రేక్షకులు గుర్తుపట్టి , కొత్త హీరోనా అని అనుకునేలోగానే ఫ్రేమ్ మారిపోతుంది.
తనతో సున్నం పెట్టుకున్నందుకు దర్శకుడు ఈ రకంగా కక్ష తీర్చుకున్నాడని ఇండస్ట్రీలో అంతా అనుకుంటున్నారు. ఆ రకంగా హీరోను తొక్కేశానని శివనాగేశ్వరరావు అనుకోవచ్చు గానీ.. సినిమాలో లేదా హీరోలో కంటెంట్ ఉంటే అదేం పెద్ద ఇబ్బంది కాదని కూడా అనుకుంటున్నారు.
హీరో డైరక్టర్‌కు నచ్చకుంటే.. యాడ్స్‌లో తీసేస్తారా?
Sunday, January 12, 2025