సిసోడియా మాటలనే రిపీట్ చేస్తున్న కవిత!

Monday, December 23, 2024

లిక్కర్ స్కాం నిందితులు అందరూ ఒకే తాను ముక్కలు లాగా కనిపిస్తుంది.  ఒకే తరహా ఆలోచన సరళితో,  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.  అరెస్టు అయిన వారు కాని వారు కూడా..  ఒకే మాదిరి మాటలతో ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  సీబీఐ చేస్తున్న విచారణ, చేస్తున్న అరెస్టులు అన్నీ కూడా కుట్రపూరితంగా జరుగుతున్న రాజకీయ అరెస్టులు మాత్రమే అనే బిల్డప్ ఇవ్వడానికి,  తమ అరెస్టులను మరింతగా గ్లోరీఫై చేసి చూపించడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. 

లిక్కర్ స్కాం వ్యవహారంలో తదుపరి అరెస్టు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉంటుందనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది.  లిక్కర్ స్కాం ఒక దశకు వచ్చిన నాటి నుంచి కవిత పేరు బహుధా ప్రచారంలో ఉంది.   ఆమెను ఇప్పటికే ఒక విడత సిబిఐ అధికారులు విచారించారు కూడా.  ఆమెతో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేకమంది వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశారు. వారి ద్వారా ఈ స్కామ్ లో కవిత పాత్రకు సంబంధించి మరింత కీలక ఆధారాలు సేకరించారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కల్వకుంట్ల కవిత..  సిబిఐ ద్వారా ఈ అరెస్టుల ఎపిసోడ్ ను నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీకి అసలు టార్గెట్ తాను కాదని,  ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెల్లడించారు.

కేసీఆర్ టార్గెట్ అయితే,  సిబిఐ అధికారులు విచారణ పర్వాన్ని కవిత చుట్టూ ఎందుకు నడుపుతున్నట్టు?  ఆమె కంటే కీలకంగా కేటీఆర్ ను కూడా ఇరికించి ఉండవచ్చు కదా!  ఏ ఆధారాలు లేకుండానే కవిత పేరును ఇందులో  చొప్పించారా?  అనే తరహా అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

‘టార్గెట్ నేను కాదు మా ముఖ్యమంత్రి’  అని కవిత చెబుతున్న మాటలు అచ్చంగా ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెబుతున్న మాటల గానే ఉన్నాయి.  ఈరోజు నన్ను అరెస్టు చేయబోతున్నారు  అంటూ బహిరంగంగా ప్రకటించి మరీ అరెస్టు అయిన మనీష్ సిసోడియా తర్వాత మీడియాతో మాట్లాడుతూ — బిజెపి అసలు టార్గెట్ తాను కాదని,  తమ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని ప్రకటించారు!  సిసోడియా మాటల నుంచి కల్వకుంట్ల కవిత కూడా స్ఫూర్తి పొందినట్లుగా కనిపిస్తోంది.  అచ్చంగా అదే మాటల చాతుర్యాన్ని ఆమె ప్రదర్శిస్తున్నారు.  నేరారూపణ తమ మీద ఉంటే తమ కంటే పెద్ద స్థాయి క్రేజ్ ఉన్న నాయకుడి పేరును ఆ వివాదంలోకి లాగడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందని  ఈ నాయకులు కలగంటున్నారో ఏమో తెలియదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles