సర్కారీ అసమర్ధతపై లోకేష్ డైరెక్ట్ ఎటాక్!

Friday, April 4, 2025

విశాఖలో మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు పేరిట.. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదార్లను ఆహ్వానిస్తున్నాం, భారీగా పరిశ్రమలు రాబోతున్నాయి.. వచ్చే ఏడాదిలో వేల ఉద్యోగావకాశాలు కూడా యువతరానికి కానుకగా అందుతాయి.. అని ప్రభుత్వం కొన్ని నెలలుగా ఊదరగొడుతున్న వేళ.. ఈ ప్రభుత్వానికి నారా లోకేష్ డైరక్టుగా సవాలు విసిరారు. ఏ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడానికి తడబడుతుందో.. అలాంటి ప్రశ్నలతో డైరక్ట్ ఎటాక్ కు దిగారు. జగన్ పాలన ప్రారంభించిన ఈ నాలుగేళ్ల కాల వ్యవధిలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్న విషయాన్ని నారా లోకేష్ తన పాదయాత్రలో విలక్షణ శైలిలో ఎత్తిచూపుతున్నారు.  రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ ఎదుట అయినా సరే మీరు నిల్చని సెల్ఫీ దిగి ఆనందించే పరిస్థితి ఉన్నదా?  అని లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

 ఈ ప్రశ్న వెనుక చాలా పెద్ద కథే ఉంది.  నారా లోకేష్ సత్యవేడు నియోజకవర్గం లో పాదయాత్ర సాగిస్తున్న సమయంలో..  ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించిన ఉద్యోగులను తీసుకువెళ్లే బస్సు తారసపడింది.  బస్సులోని అమ్మాయిలు అభివాదం చేసేసరికి..  ఆ బస్సులో ఎక్కి  నారా లోకేష్ వారితో ముచ్చటించారు.  ఆ బస్సు డిక్సన్ కంపెనీ ఉద్యోగులను తీసుకువెళుతున్నదని తెలుసుకున్నారు.  తమ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన డిక్సన్ కంపెనీ ఇంత మంది అమ్మాయిలకు ఉపాధ్యాయ అవకాశం కల్పించడం చూస్తే ఎంతో సంతోషం కలుగుతోందని అంటూ,   వారితో ఆయన సెల్ఫీ దిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

 ఆ సెల్ఫీకి ముడిపెట్టి ఆయన  ప్రభుత్వం మీద ఈ విమర్శలను సంధించడం గమనార్హం.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బూమ్ బూమ్,  ప్రెసిడెంట్ మెడల్  మద్యం బాటిల్లతో సెల్ఫీ దిగాల్సిందే తప్ప..  తాను తీసుకు వచ్చిన పరిశ్రమలతో సెల్ఫీ దిగే పరిస్థితి లేదని లోకేష్ ఎద్దేవా చేశారు. 

విశాఖపట్టణంలో వచ్చేనెల 3,4 తేదీల్లో పెట్టుబడిదారుల సదస్సు జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగకరమే. ప్రభుత్వ విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తాయి. ఇలాంటి వ్యాఖ్యలను గమనిస్తే.. నాలుగేళ్లుగా రాష్ట్రానికి చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఒక్కటి కూడా ఎందుకు రాలేదు అని.. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే వాళ్లు పునరాలోచనలో పడే అవకాశం ఉంటుంది. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా కొత్త పారిశ్రామికవేత్తలు గమనిస్తే గనుక.. రాష్ట్రానికి పెట్టుబడుల రాక ఇంకా కష్టం అవుతుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles