షర్మిల చేరిక కాంగ్రెస్‌కు ఎంత లాభం? ఏ రకంగా?

Sunday, December 22, 2024

‘తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ బిడ్డ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది’ ఈ వాక్యాలలో అర్థం చాలా అందంగా కనిపిస్తుంది. కానీ కాస్త లోతుగా పరిశీలించినప్పుడు ఈ ఒక్క వాక్యం ద్వారా ఎన్ని భావాలను వైయస్ షర్మిల పలికించదలచుకున్నారో మనం ఆలోచించాలి. గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో ప్రత్యేకంగా సమావేశమైన వైఎస్ షర్మిల అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. ఆమె స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ రాజకీయ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయబోతున్నట్లుగా కొన్ని నెలలుగా వస్తున్న వార్తలను ఆమె ధ్రువీకరించలేదు గానీ.. భేటీ పరమార్థం అదేనని అందరూ అంచనా వేస్తున్నారు. వైయస్ షర్మిల తనకు తండ్రి నుంచి వారసత్వంగా లభించిన ప్రజాభిమానం మిక్కిలిగా ఉండగల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడబోతున్నారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

ఏపీ వ్యవహారాల జోలికి తాను వెళ్లడం లేదని, పీ రాజకీయాల ప్రస్తావన తమ ఎదుట  తేవద్దని సంకేతం ఇవ్వడమే మొదటి లక్ష్యం అన్నట్టుగా వైఎస్ షర్మిల తాను నిరంతరం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంటాను అనే మాట వాడారు.

ఇక్కడ ఒక సంగతి ప్రధానంగా గమనించాల్సి ఉంది. షర్మిల తన పార్టీని విలీనం చేసినా, లేదా తాను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా రెండింటికి పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ వలన షర్మిల ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు చేజిక్కించుకున్నట్లయితే.. తాను లాభపడడం గ్యారంటీ. అంతే మోతాదులో షర్మిల వలన కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందా అనేది సందేహం! షర్మిలను పార్టీలో చేర్చుకునే డీల్ అనేది విన్ విన్ పాలసీ లాగా ఉంటుందా లేదా అనే చర్చ అధిష్టానం వద్ద నడుస్తోంది.

అదే సమయంలో, షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే కనుక వారికి కచ్చితంగా మరింత లాభం ఉంటుందనేది జగద్విదితం! అందుకే ఏపీ రాజకీయాలలో బాధ్యత తీసుకోవడం గురించి ప్రత్యేకంగా సోనియా,  రాహుల్ లు షర్మిల వద్ద మాట్లాడినట్లుగా వివరాలు బయటకు వస్తున్నాయి. షర్మిల చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఎలాంటి పొడ చిక్కకుండా, నోరు మెదపకుండా గుంభనంగా ఉంటున్నారు. ఏపీ రాజకీయాలలో కూడా భాగం పంచుకోకుండా ఉండేట్లయితే షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి వృధా అనే అభిప్రాయమే ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది. కాంగ్రెసులో చేరాలనుకుంటే గనుక.. ఏపీలో కాంగ్రెసు నాయకురాలిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి షర్మిల సిద్ధపడాల్సి ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles