షర్మిలకు గతిలేకనే వెళుతున్నట్టుంది!

Thursday, December 19, 2024

వైఎస్ షర్మిలకు సొంతంగా పార్టీని నడపగల శక్తి సన్నగిల్లిపోయిందా? కోట్లరూపాయలుసొంత డబ్బు ఖర్చు చేసుకుంటూ.. కష్టనష్టాలకోర్చి ముమ్మరంగా ప్రజల్లో తిరుగుతూ ఉన్న కూడా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ గ్రాఫ్ ఇసుమంత కూడా పెరగకపోవడంతో.. ఆమె బేజారెత్తిపోయిందా? విసిగిపోయి ఇక తన వల్ల కాదనుకునే ధోరణిలోనే ఆమె తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధపడిపోయారా? అనే చర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. షర్మిల గతిలేక తమ పార్టీలోకి వస్తున్నందువల్ల.. కాంగ్రెస్ కూడా ఆమెకు అంత సీరియస్ గా విలువ ఇవ్వడం లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది.
కాంగ్రెసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయడానికి సంబంధించి.. తుదివిడత చర్చలు కూడా పూర్తయ్యాయని షర్మిల మీడియాకు వెల్లడించారు. కాంగ్రెసు పార్టీ ఇప్పటికీ కూడా తన తండ్రి వైఎస్సార్ ను గౌరవిస్తున్నందువల్లనే, ఆయన స్ఫూర్తికి విలువ ఇస్తున్నందువల్లనే.. విలీనం చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. తన సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడిన తర్వాత.. నిర్ణయాన్ని వెల్లడిస్తానని.. తనతో ఉన్న వారినందరినీ గుర్తుంచుకుంటానని షర్మిల చెబుతున్నారు.
ఆమె తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఎన్నయినా చెబుతుండవచ్చు గాక.. కానీ.. కాంగ్రెసులో ఆమెకు దక్కబోతున్న ప్రాధాన్యం ఎంత అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ఆమె కోరుకునే పాలేరు సీటు దక్కే అవకాశం ఆల్మోస్ట్ మూసుకుపోయినట్టే. అసలు ఆమె ఎమ్మెల్యే ఎన్నికలను ఎంచుకోకుండా ప్రచారానికి పరిమితం అయినట్లయితే.. ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపడానికి పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. షర్మిల ఆ రాజ్యసభ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
కాంగ్రెసులో విలీనం కాకముందే ఆమెను పార్టీ ఎంతగా చిన్నచూపు చూస్తున్నదంటే.. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తోంటే.. కనీసం ఆమెను ఆహ్వానించలేదు. అలాగని.. పూర్తిగా పార్టీ కార్యక్రమంగా కూడా నిర్వహించలేదు. సీపీఐ నారాయణను కూడా ఆహ్వానించారు. ఇలాంటి పరిణామాలను గమనిస్తున్నప్పుడు.. గతిలేక షర్మిల కాంగ్రెసులోకి వెళుతున్నదని, పక్కనపెట్టేయడం కోసమే.. కాంగ్రెసు ఆమెను పార్టీలో చేర్చుకుంటున్నదని అనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles