జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ యుద్ధక్రీడలో తుదిదశ ఎత్తుగడలకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ జల్లెడ పట్టడానికి డిసైడ్ అయ్యారు. ఒక శాస్త్రీయమైన పద్ధతిలో శత్రు ఓటర్ల ఏరివేత కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ దెబ్బతో, కొన్ని నెలలు గడిచేలోగా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే వారెంతమంది? వేయని వారు ఎంత మంది? అనే స్పష్టత వచ్చేస్తుంది! అప్పుడిక రాజకీయ ఎత్తుగడలు పూర్తిగా మారుతాయి. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే పేరుతో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్న కార్యక్రమం యొక్క అంతిమ లక్ష్యం అదే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను, ప్రతి యాభై ఇళ్లకు ఒక గృహసారథిని ఎంపిక చేశారు. నిజానికి వీరి ఎంపిక నామమాత్రం. రికార్డుల్లో చెప్పుకోవడానికి, మేమేమీ వాలంటీర్లను వాడుకోవడం లేదు, మా సొంత పార్టీ యంత్రాంగంతో మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని బుకాయించడానికి తప్ప ఈ గృహసారథులు ఎందుకూ కొరగారు. స్థానికంగా అత్యుత్సాహం ఉన్నవారు తప్ప.. వీరు ఇంటింటికీ తిరగడం కూడా జరిగే పని కాదు. కానీ.. వాలంటీర్ల ద్వారానే మొత్తం కార్యక్రమాన్ని నడిపించాలనేది వైసీపీ ప్లాన్. వాలంటీర్లను వాడుకోవడానికి అధికారిక ముసుగు తగిలించడం కోసం ఆసరా లేఖను అందజేయడం అంటూ ఒకటి జతచేశారు. ఇంటింటికీ వారిని తిప్పి, చంద్రబాబునాయుడు ఎంత చెత్త ముఖ్యమంత్రో , జగన్మోహన్ రెడ్డి ఎంత అద్భుతమైన పరిపాలకుడో వారితో ప్రతి ఇంటి వాకిట్లో కరపత్రం చదవడం రూపేణా ఒక హరికథ చెప్పిస్తారు. ఆ తర్వాత ఒక సర్వే కార్యక్రమం ఉంటుంది. ఆ ఇంటి యజమాని పేరు, వారి ఫోను నెంబరును కూడా తీసుకుంటారు.
ఆ సర్వేఫారం వద్దనే మతలబు ఉంటుంది. దానికి ‘టిక్’ సమాధానాలు చెప్పేవాళ్లు వైకాపా ఓటర్లు. వ్యతిరేకసమాధానాలు చెప్పేవాళ్లు జగన్ శత్రువులు. టిక్ లు చెప్పిన వాళ్లకి ఓ రసీదు కూడా ఉంటుంది. భవిష్యత్తులో ఏదైనా పథకాలకో, పనులకో నాయకులు, అధికార్ల దగ్గరకు వెళ్లినప్పుడు.. ఈ రసీదు తీసుకురావాలని నిబంధన పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు.
అన్నీ అద్భుతం అన్నవాళ్ల ఇంటికి జగనన్న స్టిక్కరు అంటిస్తారు. ఫోను కూడా స్టిక్కరు వేస్తారు. ఆ ఇంటి తలుపు వద్ద యజమానిని నిలబెట్టి ఫోటో తీసి జగనన్నకు తెలిసేలాగా తమ గ్రూపుల్లో పోస్టు చేస్తారు.
అయితే ఈ ప్రక్రియలో శత్రుఓటర్ల స్పష్టమైన ఏరివేత జరగబోతున్నది. రాబోయే ఏడాది రోజుల్లో వారిని ఎన్నిరకలుగ ఇబ్బండి పెడతారో అనే భయం ప్రజల్లో ఏర్పడుతోంది. తాము ఓటు వేసేది ఎవరికైనా సరే.. వాలంటీర్లు వచ్చి అడిగితే ప్రతి దానికీ ఎస్ చెప్పడం శ్రేయస్కరం అని వారు భయపడుతున్నారు.
శత్రు ఓటర్ల ఏరివేత ప్రారంభం!
Sunday, December 22, 2024