వైసీపీ.. జనం నోర్లు మూయిస్తున్నదెలాగంటే.. 

Monday, January 13, 2025

ఓ చిన్న పట్టణానికి శివార్లలో పల్లెటూరి రోడ్లో ఉన్న చిన్న స్థాయి హోటలు అది.  మొగుడు పెళ్ళాం కలిసి పని చేసుకుంటూ హొటలు నిర్వహిస్తుంటారు,   ఓ నలుగురు ఆడవాళ్లు అక్కడ టిఫిన్ తినడానికి వచ్చారు.  నలుగురు సుష్టుగా  తిన్నారు.  బాగా తిని త్రేన్చిన తర్వాత,  డబ్బులు అడిగాడు హోటల్ యజమాని. . మీ ఆవిడ చేతికి 500 నోటు ఇచ్చాం..  నువ్వే చిల్లర ఇవ్వాలి అన్నారు ఆ నలుగురు ఆడవాళ్లు.  మీరేసిన డబ్బులు ఎప్పుడు ఇచ్చారు అంటూ హోటలు యజమాని భార్య కూడా ఆశ్చర్యపోయింది.  ఆ నలుగురు ఆడవాళ్లు ఇసుమంతైనా తగ్గలేదు.  ఇద్దరికీ నడుమ వాగ్వాదం జరిగింది.  ఏతావతా తేలినదేమంటే..  ఆ నలుగురు ఆడవాళ్లు వెళ్లి హోటల్ యజమానిమీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.  ఆడవాళ్ళం అని కూడా చూడకుండా డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వలేదని నిందలు వేస్తూ..  పైగా తమ కులం పేరుతో దూషించాడు అంటూ ఆరోపించారు.  పోలీసు రికార్డుల ప్రకారం ఇదీ కథ!

 ఈ కథ ఈ రకంగా జరగడానికి సంబంధించిన మూలం నాలుగు రోజుల కిందట జరిగింది.  తెలుగుదేశం పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.  తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతంలో తిరుగుతుండగా..  ఆ హోటలు ఉన్న రోడ్డులో కూడా వెళ్లారు. లోకేష్ యాత్ర తో పాటు ఫాలో అవుతున్న మీడియా ప్రతినిధులు కొందరు..  ఆ హోటల్ యజమాని నుంచి ప్రస్తుత పరిస్థితులపై అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు.  ఆ హోటల్ యజమాని తన కడుపుమంట ఏమిటో బయట పెట్టుకున్నాడు.  ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో చెప్పుకున్నాడు.  అవన్నీ ప్రభుత్వ  వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేవి.  తర్వాత ఆమెను ఒక టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేసింది. బైట్ తీసుకుంది.  ప్రభుత్వ వైఫల్యాలపై ఆ హోటల్ యజమాని భార్య సూటిగా నిలదీయడంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. 

 దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను టార్గెట్ చేశారు. వారి పురమాయింపుతో కొందరు మహిళలు వచ్చి,  హోటల్లో టిఫిన్ అడిగి,  ప్రభుత్వంపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతావా అంటూ ఆమెను తీవ్రంగా కొట్టి వెళ్లిపోయారు.  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉండగానే..  ఈలోగా ఆమె మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.

 ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా…  ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళ నోర్లు ఎలా మూయిస్తున్నారో? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరూరా ఇదొక అలవాటుగా మారిపోయింది అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  ప్రజలు వ్యతిరేక గళం వినిపిస్తే చాలు..  వారి భరతం పట్టడానికి పూనుకుంటున్నారు.  ఇలాంటి వ్యవహారాలు ఎన్నికల నాటికి ఎలాంటి ఫలితాలుగా పరిణమిస్తాయో వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles