వారాహి రూఢుడై నారసింహ యాత్ర!

Thursday, September 19, 2024

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సమరాంగణంలోకి దిగుతున్నట్టే!ఈ నెల 24న ఆయన వారాహి యాత్ర మొదలు కానుంది. తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో లాంఛనంగా వారాహి వాహనానికి ఆరోజు పూజలు ఉంటాయి. అలాగే ధర్మపురిలో ఉన్న లక్ష్మీనారసింహ క్షేత్రాన్ని పవన్ కల్యాణ్ దర్శిస్తారు. అది మొదలుగా 32 నారసింహ క్షేత్రాలను సందర్శించే అనుష్టుప్ నారసింహ యాత్రను పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారు. అయితే ఇది మౌలికంగా ఆధ్యాత్మిక క్షేత్రాల యాత్రగా కనిపిస్తున్నప్పటికీ.. పనిలోపనిగా రాజకీయంగా పార్టీని బలోపేతం చేసే యాత్రగా కూడా సాగుతుంది. ఈనెల 24వ తేదీ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత తెలంగాణకు చెందిన సుమారు 35 నియోజవకర్గాల పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం ద్వారా.. నారసింహ క్షేత్రాలతో పాటూ.. పార్టీ వ్యవహారాలు కూడా చక్కబెట్టేలా యాత్ర సాగించనున్నట్టు పవన్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం.. రాష్ట్రమంతా పర్యటించడానికి వారాహి వాహనాన్ని రూపొందించుకున్న సంగతి తెలిసిందే. ఈ వాహనానికి సంబంధించి చాలా వివాదం కూడా రేగింది. అయితే ఆయన ఎప్పటినుంచి సమరశంఖం పూరించబోతున్నారనేది మాత్రం తేలలేదు. ఒకవైపు చంద్రబాబునాయుడు సుడిగాలిలా రాష్ట్రమంతా చుట్టబెట్టేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడంలో దూసుకుపోతున్నారు. మరోవైపు నారా లోకేష్ పాదయాత్ర కూడా మరో పదిరోజుల్లో మొదలు కాబోతోంది. మొదటి విడతగా మూడు జిల్లాల్లో అనుమతుల నిమిత్తం పోలీసులకు దరఖాస్తు చేశారు కూడా. అయితే పవన్ యాత్ర ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల ప్రచారం రూపేణా ప్రభుత్వం నిరంతరాయంగా స్ట్రెయిట్ ఎటాక్ కు దిగడానికి ఇంకా సమయం ఉందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.ఈలోగా తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద కూడా ఆయన దృష్టి పెడుతున్నారు. అందుకే నారసింహ యాత్ర చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. 32 నారసింహ క్షేత్రాల్లో మెజారిటీ రెండు తెలుగురాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి. మిగిలినవి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. ఈ క్షేత్రాలన్నీ పర్యటించడం అంటే స్థూలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా పర్యటించడం కింద అవుతుంది. ఆయా క్షేత్రాలకు వెళ్లడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల తర్వాత.. స్థానిక ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించుకుని వ్యూహరచన చేయడం రెండు పనులూ పూర్తవుతాయని పవన్ కల్యాణ్ ఈ నారసింహ యాత్రకు పూనుకుంటున్నట్టుగా సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles