వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఏమిటి? అనేదే కథాంశంగా.. ‘వ్యూహం’ పేరుతో ఒకప్పటి మంచి దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రం రూపొందిస్తున్నారు. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి జీవిత కథ లాంటిది. ఇది ఖచ్చితంగా జగన్ ను భజన చేయడానికి, జగన్ కు ఎన్నికల్లో మైలేజీ ఇవ్వడానికి అనుకూలంగా తయారైన సినిమా అనే విషయంలో అనుమానం లేదు.
అయితే వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఖర్చు వారికి దండగమారి వ్యవహారం అని.. దానివల్ల వారికి నయాపైసా ఉపయోగం ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు వ్యూహం సినిమా గురించి రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. ఇది రాజకీయంగా తాను నమ్మిన విషయాలను తెలియజెప్పడానికి మాత్రమే తాను సినిమా తీస్తానని ప్రకటించారు. ఎన్నికలపై ప్రభావం పడాలనే సినిమాగా తీస్తున్నానని కూడా వెల్లడించారు. పవన్ తప్ప మెగాఫ్యామిలీ నుంచి ఎవ్వరూ నాపై కామెంట్ చేయడం లేదని కూడా తనకు తోచిన అబద్ధాలను మీడియా ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. అంతకు మించిన తమాషా ఏంటంటే.. వ్యూహం సినిమా రూపొందించడం వెనుక వైసీపీ వారు ఎవ్వరూ లేరని వర్మ చెప్పారు.
నిజానికి రాంగోపాల్ వర్మకు జగన్మోహన్ రెడ్డి తరఫున వంద కోట్ల రూపాయలు ముట్టాయని సినిమాలు సహా, వీలైనంత వరకు అన్ని ఫార్మాట్లలో వైసీపీ అనుకూల ప్రచారాలకు ఆయన పనిచేయాలని.. ఎన్నికలదాకా చేసే పనికి ఈ డీల్ ఉంటుందని ఒక పుకారు ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది.
కాగా, వ్యూహం చిత్రం మాత్ర అవుట్ పుట్ వైసీపీ పెద్దలు ఆశించినట్టుగా లేదని సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని పార్ట్ 1, పార్ట్ 2 గా చేయాలని అనుకున్నారు. ఆమేరకే రూపొందించారు. అయితే ఇప్పుడు ఒకటే పార్ట్ గా విడుదల చేయబోతున్నట్టుగా నిర్ణయించారు.
అయితే.. ఈ చిత్రం రెండు భాగాలను వైసీపీ పెద్దలు చూశారని, అవుట్ పుట్ చెత్తగా ఉన్నదనే అభిప్రాయంతో.. పరువు పోతుందనే భయంతో.. రెండు కాకుండా ఒకటే పార్ట్ గా విడుదల చేయాలని వర్మకు అల్టిమేటం ఇచ్చారని కూడా ఒక పుకారు వినిపిస్తోంది. మొత్తానికి వర్మ తో సినిమా తీయించి, ఏదో లాభపడవచ్చునని అనుకున్న వైసీపీ కి దీనిపై పెట్టిన ఖర్చు కూడా దండగేనని పలువురు భావిస్తున్నారు.
వర్మ ‘వ్యూహం’ : వైసీపీకి దండగమారి ఖర్చు!
Friday, November 15, 2024