మోడీ మూగనోముకు కారణం అదేనేమో!?

Thursday, December 19, 2024

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన నాయకుడు. జనరంజకంగా మాట్లాడే టెక్నిక్ ఆయనకు తెలుసు! సమ్మోహకంగా మంచి భాషా పటిమతో హిందీ, ఇంగ్లీషు భాషల మీద సమానమైన పట్టుతో మాట్లాడడం ఆయన సాధన చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం ‘నోటికి తాళం వేసుకున్న ప్రధానమంత్రి’ అనే విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. మణిపూర్ రాష్ట్రం మొత్తం రెండు తెగల కుమ్ములాటల మధ్య దహించుకుపోతున్నప్పటికీ ప్రధానిగా బాధ్యత తీసుకోవాల్సిన నరేంద్ర మోడీ మౌనం పాటిస్తున్నారు. అక్కడ అల్లర్లను నియంత్రించడానికి ఏం చర్యలు తీసుకున్నారో ఏమో గాని బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేద! ప్రతిపక్షాలు ఈ విషయంలో దుమ్మెత్తిపోస్తున్నా పట్టించుకోవడం లేదు.

సాధారణంగా సభలలో ప్రసంగాలు, రేడియో ప్రసంగాల రూపంలో అనేక ఆకర్షణీయమైన మాటలు చెప్పే ప్రధాని నరేంద్ర మోడీ.. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్ల మీద కనీసం పెదవే విప్పకపోవడం సర్వత్రా విమర్శలకు గురవుతూ ఉంది. మణిపూర్ లో మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో బయటకు వచ్చిన సందర్భంలో- సిగ్గుపడాల్సిందిగా తన అభిప్రాయం వెలిబుచ్చడం మినహా ఈ అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడడం లేదు. ఇంత అచేతనమైన ప్రధానమంత్రిని తాము ఎన్నడూ చూడలేదని ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ వివాదాలకు భయపడి నోటికి తాళం వేసుకున్నట్లుగా అనిపిస్తోంది. అలా అనుకోవడానికి ఊతమిచ్చేలాగా..  ఆయన తాజా మాటలున్నాయి. తన పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం అవుతూ, రాబోయే ఏడాది జరిగే ఎన్నికలకు వారిని సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మోడీ. ఆ క్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఎంపీలతో విడతలవారీగా ఆయన స్వయంగా సమావేశం అవుతున్నారు. ఇటీవలే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల బిజెపి ఎంపీలతో కూడా సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ఎంపీలు ఎవరు కూడా విపక్ష పార్టీలు పన్నుతున్న కుట్ర రాజకీయాలకు లొంగకుండా ముందుకు సాగాలని పిలుపుఇచ్చారు. వివాదాస్పద అంశాల గురించి ఎవ్వరూ మాట్లాడవద్దని, తమ పార్టీ వారిని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయించడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, నాయకులెవ్వరూ రెచ్చిపోకుండా ఉండాలని అంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా ఎంపీలు మాట మీద నియంత్రణ పాటించాలని తమ ఎంపీలకు పిలుపు ఇస్తున్నారు. మోడీ చెబుతున్న హితోపదేశాన్ని గమనిస్తే ‘మణిపూర్ గురించి ఏ చిన్నమాట మాట్లాడినా సరే ఒక కొత్త వివాదంలో చిక్కుకుంటాం’ అనే భయం వల్లనే ఆయన ఇన్నాళ్ళుగా మౌనం పాటిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. తాను మౌనంగా ఉండడం, మూగ నోము ఆచరించడం మాత్రమే కాదు.. తన పార్టీ మొత్తం కూడా మూగనోము పాటించేలా ఆయన వ్యూహరచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles