ముందస్తు తప్పదనే సన్నాహాల్లో తెలుగుదేశం!

Monday, September 16, 2024

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది మే వరకు ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారా? ఆ లోగా తన వైఫల్యాలు బయటపడితే ఎన్నికలకు ముందు ప్రజల ఎదుట పరువు పోతుందని భయపడుతున్నారా? ఆర్థిక వనరుల లేమి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోజురోజుకు మరింత సంకటంలోకి నెడుతున్నదా? అనే రకరకాల అనుమానాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆగస్టు నెలలో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.

భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు తనకు ఉంటాయని ఊహించుకుంటూ వచ్చిన  జగన్మోహన్ రెడ్డికి ఇటీవల అమిత్ షా, జెపి నడ్డాలు రాష్ట్రంలో నిర్వహించిన సభలు పెద్ద ఆశనిపాతం అని చెప్పాలి. బిజెపి ఇక తమకు అండగా ఉండకపోవచ్చు అని ఆయన సభాముఖంగానే వెల్లడించారు. అంటే ఆయన అంతరంగంలో వారి అండను ఆశిస్తూ వచ్చారనే విషయం మనకు బోధపడుతుంది. బిజెపితో కూడా వైరభావాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆయన తనకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తారని అంచనా.

బిజెపి వారు కూడా ఎన్నికలకు సిద్ధం కాకుండా ఉండేందుకు, అందుకు తగిన వ్యవధి ఎవరికి ఇవ్వకుండా వీలైనంత వెంటనే అసెంబ్లీని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని జగన్ కోటరీ ఆలోచిస్తున్నట్లుగా ఒక ప్రచారం  ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మధ్యంతర ఎన్నికలకు అనుగుణమైన వ్యూహరచనతోనే ముందుకు సాగుతుండడమే విశేషం. తాజాగా రాష్ట్రంలో 125 నియోజకవర్గాలను కవర్ చేసేలాగా ఐదు బస్సు యాత్రలను పార్టీ ప్రారంభించనుంది. ఈ నెల 19న మంగళగిరి పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు బస్సు యాత్రలను ప్రారంభిస్తారు. బస్సు యాత్రలో కీలక నాయకులు ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జీలు అందరూ కలిసి పర్యటిస్తారు. గ్రామాల్లోనే బస చేస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను, చేతకానితనాన్ని వారికి వివరిస్తూ ముందుకు సాగుతారు. ఈ బస్సు యాత్రల హఠాత్ వ్యూహం కేవలం మధ్యంతర ఎన్నికలకు సమాయత్తం కావడానికే అనే ప్రచారం ఉంది.

జగన్ అసెంబ్లీని రద్దు చేస్తే కనుక ఎన్నికలలోగా నారా లోకేష్ పాదయాత్ర రాష్ట్రం మొత్తాన్ని కవర్ చేయడం సాధ్యం కానీ పని. అందుకే ఆయన ఇప్పటికే పాదయాత్ర పూర్తి చేసిన రాయలసీమ జిల్లాలను పక్కనపెట్టి మిగిలిన అన్ని ప్రాంతాలను బస్సు యాత్రతో కవర్ చేయాలని వారు భావిస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీ రద్దు కాకుండా లోకేష్ పాదయాత్ర జరిగినా కూడా డబల్ అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles