రామోజీరావు మీద బురద చల్లడానికి, ఆయనను నేరగాడిగా ప్రపంచానికి చాటిచెప్పి అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు పాపం నానా పాట్లు పడుతోంది. అయితే జగన్ ప్రయత్నాలు బ్యాక్ ఫైర్ అయి.. ఈ ఎపిసోడ్ మొత్తంలో ప్రభుత్వానికే పరువు పోతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజలనుంచి ఒక్క ఫిర్యాదు లేకపోయినా.. చిట్ కస్టమర్లు నష్టపోకుండా ఉండాలనే విశాలమైన ఆలోచనతో ఈ దర్యాప్తును కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ రామోజీరావును విచారించిన తీరు, పెడుతున్న కేసులు ప్రభుత్వ దురుద్దేశాన్ని ప్రజలకు చాటిచెప్పేలాగానే కనిపిస్తున్నాయి.
కంపెనీల చట్టం కింద రిజిస్టరు అయి ప్రతి ఏటా రికార్డులు సమర్పిస్తూ నడుస్తున్న మార్గదర్శి చిట్స్ ను చిట్స్ చట్టం కింద ఎందుకు రిజిస్టరు కాలేదని ఏపీసీఐడీ ప్రశ్నిస్తోంది. అయితే.. కంపెనీల చట్టం కింది రిజిస్టరు కావడానికి అవకాశం ఉందా? లేదా? అనేది ముందుగా తేల్చాలి. కంపెనీల చట్టం కింద చిట్స్ వ్యాపారం రిజిస్టరు కావడానికి అవకాశమే లేకపోతే.. అలా రిజిస్టరు చేసుకోవడానికి కారకులైన అధికారుల్ని కూడా శిక్షించాలి. ఇన్నాళ్లుగా మార్గదర్శి వారి బ్యాలెన్స్ షీట్ లను ఆమోదిస్తున్న అధికారులను కూడా విచారించాలి. కానీ ప్రభుత్వం అర్థసత్యాలతో ప్రజలను మాయచేసి రామోజీరావు మీద బురద చల్లడం ఒక్కటే జీవితాశయంగా బతుకుతున్నది కాబట్టి వీటిని పట్టించుకోవడం లేదు.
ఒకే సంస్థ, బ్రాంచి కార్యాలయాలను నిర్వహిస్తున్నప్పుడు.. బ్రాంచి కార్యాలయాలనుంచి సొమ్ము ప్రధాన కార్యాలయానికి మళ్లడాన్ని కూడా నేరంగా చూపించి.. ప్రజలకు ద్రోహం జరిగిపోయినట్టుగా చాటిచెప్పడానికి ప్రభుత్వం ఈ తరహా కుట్ర ప్రచారం చేస్తోంది.
మరోవైపు మార్గదర్శిలో చిట్లు వేస్తున్న వారిని.. సంస్థ మీద ఫిర్యాదు చేయాల్సిందిగా ఒత్తిళ్లు వస్తుండడం కూడా గమనార్హం. మార్గదర్శి మీద నమ్మకంతో ఇన్నాళ్లుగా ఏపీసీఐడీ దర్యాప్తు సాగిస్తున్నప్పటికీ… వినియోగదార్లనుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఈ వ్యవహారం దర్యాప్తు సంస్థకు చాలా ఇబ్బందికరంగా మారింది. సంస్థ సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడాన్ని కూడా నేరంగా అభివర్ణించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
కేంద్రంప్రభుత్వం ఒక సంస్థకు ఇచ్చిన నిధులను మళ్లించి మరో పనులకు వినియోగించడం, పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించి సచివాలయాల నిర్మాణాలు చేపట్టుకోవడం వంటి ‘మళ్ళింపు’ రాజకీయాలకు పేరుమోసిన జగన్మోహన్ రెడ్డి.. మార్గదర్శి సంస్థ విషయంలో పద్ధతి ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్న వ్యవహారాలను కూడా నేరాలుగా చూపించడానికి ఆరాటపడడం ఆయన కుట్రబుద్ధికి నిదర్శనంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రామోజీరావు వ్యవహారంలో మరింత కక్షపూరితంగా వ్యవహరించే కొద్దీ.. ప్రభుత్వం మీద, జగన్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అంచనాలు సాగుతున్ానయి.
‘మళ్లింపు’ నీతులు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు
Wednesday, January 22, 2025